
సాక్షి, హైదరాబాద్: టాప్ హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనిరుధ్ ప్రేమలో మునిగి తేలుతున్నారా? త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారా? మహానటి మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. కీర్తి వివాహానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి పెళ్లిపై మరో గాసిప్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి ప్రేమలో పడిందని, వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తమిళంలో వరస మూవీలతో బిజీగా ఉన్న అనిరుధ్ ప్రియురాలు కీర్తి సురేష్‌తో త్వరలోనే ఏడడుగులు వేయాలని భావిస్తున్నాడట. దీంతో కీర్తి తల్లిదండ్రులు వీరి పెళ్లి ముహూర్తం నిశ్చయించనున్నారట. మరోవైపు ఈ సందర్భంగా అనిరుధ్, కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత అక్టోబర్ (16 అనిరుధ్, కీర్తి సురేష్17) లో పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరూ పరస్పరం బర్తడే విషెస్ తెలుపుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కీర్తి రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఇపుడవే వైరల్‌గా మారాయి. మరోవైపు తమిళంలో ప్రముఖ గాయని జోనీతాగాంధీతో అనిరుధ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. మరి తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన కీర్తి తాజా ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ సినిమా పనుల్లో బిజీగా ఉంది. అటు దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మాస్టర్ ఫిల్మ్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అనిరుధ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న కమాండర్ 65 చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment