Sarkaru Vaari Paata Grant Pre Release Event On May 7th At Yousufguda Hyderabad - Sakshi
Sakshi News home page

SVP Pre-Release Event: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

Published Sat, May 7 2022 1:56 PM | Last Updated on Sat, May 7 2022 3:11 PM

Sarkaru Vaari Paata Grant Pre Release Event On May 7th At Yousufguda - Sakshi

Sarkaru Vaari Paata Grant Pre Release Event: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ వేగవంతం చేసిన చిత్ర బృందం ఈ రోజు గ్రాండ్‌ ప్రి-రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకోనుంది. శనివారం(మే 7) సాయంత్రం 6 గంటలకు యూసుఫ్‌ గూడ  1వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్‌లో ఈ వేడుకను నిర్వహించారు.

చదవండి: సర్కారువారి పాట: మ.. మ.. మహేశా సాంగ్‌ విన్నారా?

మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఈ మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇందులోని కళావతి సాంగ్‌, ఎవ్రీ పెన్నీ సాంగ్‌లు అయితే రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచాయి. దీంతో ఈ మూవీని  చూసేందుకు తెలుగు ప్రేక్షకులు, మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement