
మహేశ్‌బాబు నటించనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో చిన్న మార్పు వచ్చిందని సమాచారం. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి. కీర్తీ సురేశ్ కథానాయిక. బ్యాంక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలిసింది.
ఈ సినిమాలో మహేశ్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమా చిత్రీకరణను అమెరికా షెడ్యూల్‌తో ప్రారంభించాలనుకున్నారు. జనవరి నుంచి అమెరికాలో 45 రోజుల షెడ్యూల్ జరపాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే ప్లాన్‌లో చిన్న చేంజ్ అని తెలిసింది. హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ఆరంభించాలనుకుంటున్నారట. జనవరి మొత్తం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపి, ఫిబ్రవరిలో యూఎస్ వెళ్లనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మది కెమెరామేన్.
Comments
Please login to add a commentAdd a comment