ఫారిన్‌ ప్లాన్‌ వేశారా? | foreign tour with sarkar vaari pata movie team | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ ప్లాన్‌ వేశారా?

Published Mon, Aug 17 2020 1:27 AM | Last Updated on Mon, Aug 17 2020 2:10 AM

foreign tour with sarkar vaari pata movie team - Sakshi

’సర్కారు వారి పాట’ చిత్రబందం ఫారిన్‌ ప్లాన్‌ వేసిందని సమాచారం. ఈ సినిమాను అమెరికాలో షూట్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని14 రీల్స్‌ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. బ్యాంకు స్కామ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ చిత్రకథ సాగుతుందట. ఆల్రెడీ ఈ చిత్రం ప్రీ–లుక్‌ మరియు, మోషన్‌ పోస్టర్‌ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ చిత్రం షూటింగ్‌ ను ఫారిన్‌ షెడ్యూల్‌ తో మొదలు పెట్టాలనుకుంటున్నారట. అక్టోబర్‌ లేదా నవంబర్‌ మొదటి వారంలో ఈ చిత్రబందం అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. ఒక నెలరోజుల పాటు అక్కడ చిత్రీకరణ చేయాలనుకుంటున్నారట. కరోనా పరిస్థితులు అప్పటికి సర్దుకుంటాయా? లేదా అనేది చిన్న సందేహం. ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ కథానాయిక అని టాక్‌. కెమేరామ్యాన్‌ మది. తమన్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement