
‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కీర్తీ సురేష్. దక్షిణాదిలో క్రేజీ ఆఫర్లతో దూసుకెళుతోన్న ఆమె పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా కీర్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్ కీర్తీ సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కారువారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని ట్వీట్ చేశారు మహేశ్‌బాబు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కీర్తీ సురేష్ ప్రచార చిత్రం విడుదల
నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘రంగ్ దే’లోని ఆమె ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది.