Keerthy Suresh Shares Weekend Pics with Kalyani Priyadarshan & Pal - Sakshi
Sakshi News home page

Keerthi Suresh: పోస్ట్‌ వెడ్డింగ్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్‌

Published Mon, Jun 13 2022 6:09 PM | Last Updated on Mon, Jun 13 2022 6:30 PM

Keerthi Suresh Shares A Photos From Her Kerala Tour Captioned Post Wedding Bash - Sakshi

మహానటి కీర్తి సురేశ్‌ తన సొంత రాష్ట్రం కేరళలో వాలిపోయింది. ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్న కీర్తి షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకుని స్నేహితులతో కలిసి ఎంజాయ్‌​ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలోని స్నేహితురాలి పెళ్లికి హాజరైన కీర్తి వరుస ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె స్నేహితులతో కలిసి కేరళలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫొటోలను పోస్ట్‌ వెడ్డింగ్‌ బాష్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ ఫొటోల్లో మరో హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శిని కూడా ఉండటం గమనార్హం.

చదవండి: వెడ్డింగ్‌ యానివర్సరీ: వైరల్‌గా చరణ్‌, ఉపాసన పెళ్లి వీడియో..

దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వరుస ప్లాప్‌లతో ఐరన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి.. ‘సర్కారు వారి పాట’తో భారీ విజయం అందుకుని మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. దీంతో ఆమెకు మళ్లీ ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో కీ రోల్‌ పోషిస్తోంది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. దీనితో పాటు ఆమె నాని ‘దసరా’ మూవీతో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

చదవండి: విజయ్‌, రష్మికల షూటింగ్‌ ఫొటోలు లీక్‌.. డైరెక్టర్‌ అప్‌సెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement