Keerthi Suresh Saani Kaayidham Movie To Release In OTT: Check Details - Sakshi
Sakshi News home page

ఓటీటీకి కీర్తి సురేశ్‌ మూవీ

Published Fri, Aug 20 2021 7:56 AM | Last Updated on Fri, Aug 20 2021 12:59 PM

Keerthi Suresh Latest Saani Kaayidham Movie Release In OTT - Sakshi

మహనటి కీర్తీ సురేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ఆమె తమిళంలో ‘సాని కాయిదమ్‌’ అనే వైవిధ్యమైన చిత్రంలో నటించింది. 1980 కాలం నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా దర్శకుడు మహేశ్వర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టెసింది. ఈ నేపథ్యంలో నిన్న(అగష్టు 19) ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో కీర్తి ఒక పెల్లెటూరి అమ్మాయిగా ఢిగ్లామర్‌తో కనిపించగా ఆమె పక్కనే ఆమె పక్కనే దర్శకుడు సెల్వరాఘవన్‌ లుక్‌ ఆసక్తిగా ఉంది. ఇందులో ఆయన చేతులకు రక్తంతో ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ చిత్రంలో సెల్వ రాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాయి కానిదమ్‌ అద్భుతమైన జర్నీ అని, ఈ మూవీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని ఈ సందర్భంగా సెల్వ రాఘవన్‌ అన్నాడు. పొస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినికిడి. కీర్తిసురేశ్ ఇంతకుముందు చేసిన ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలాగే ‘సానికాయిధమ్’ కూడా ఓటీటీలోనే రానుందని అంటున్నారు.  సర్కారి వారి పాట మూవీతో పాటు కీర్తి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అన్నాత్తై మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement