బై బై గోలీరాజు | Adi Pinchetti shooting completd for Good Luck Sakhi | Sakshi
Sakshi News home page

బై బై గోలీరాజు

Sep 6 2020 5:24 AM | Updated on Sep 6 2020 5:24 AM

Adi Pinchetti shooting completd for Good Luck Sakhi - Sakshi

ఆది పినిశెట్టి

‘మహానటి’ ఫేమ్‌ కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘గుడ్‌లక్‌  సఖి’. నగేష్‌ కుకునూర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పిస్తున్న  ఈ చిత్రాన్ని సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోలీ రాజు పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. శనివారంతో గోలీ రాజు పాత్రధారి ఆది పినిశెట్టి సన్నివేశాలు పూర్తయ్యాయి. దీంతో చిత్రబృందం గోలీ రాజుకి బై బై చెప్పింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఒక చురుకైన గ్రామీణ యువతి క్రీడల్లో అడుగుపెట్టి షూటర్‌గా ఎలా ఎదిగి ఊరికి పేరు తెచ్చిందనే కథాంశంతో తయారవుతున్న చిత్రమిది. షూటింగ్‌ ట్రైనర్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేసిన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: చిరంతన్‌ దాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement