![No updates on Sarkaru Vaari Paata movie shooting - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/28/Mahesh-Babu.jpg.webp?itok=Hm1Kjp4q)
‘సర్కారువారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని హీరో మహేశ్‌బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా మే 31న ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండదు.. ఆ రోజు అన్ని వేడుకలు రద్దు చేసిన ట్లు మహేశ్‌బాబు టీమ్ అధికారికంగా పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ను విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించారు.
సినిమా అప్‌డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని వారు భావిస్తున్నారు. అప్‌డేట్ విషయంలో ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకూడదు.. ఏదైనా సమాచారం ఉంటే యూనిట్ నుంచి అధికారికంగా వస్తుంది’’ అని మహేశ్‌బాబు టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారువారి పాట’లో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment