
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతోంది. సరదాగా ఆమె ముంబై పర్యాటనకు వెళ్లినట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది పర్‌ఫెక్ట్ మిట్‌వీక్ మూడు’ అంటూ ఫొటో షేర్ చేసింది. ఇందులో కీర్తి బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్‌డ్ తెలుపు రంగు చొక్కాలో ఉన్న కీర్తిసురేశ్ చిరునవ్వులు చిందిస్తూ పూల మొక్కల ముందు నిలబడి ఫొటోకు ఫోజు ఇచ్చింది. అలాగే వీకెండ్ కోసం ఎదురుచూస్తూ..అంటూ #WednesdayVibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్‌లను జతచేసింది.
చదవండి: ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం
కాగా కీర్తి ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ సరసన సందడి చేయనుంది. అయితే సర్కారు వారి పాట ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ‘కీర్తి హైదరాబాద్‌లో ఉండకుండా ముంబైలో ఏం చేస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్ తన పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్కారి వారి పాటలో తన షూటింగ్ షెడ్యూల్‌ను కాస్తా విరామ సమయంలో దొరకడంతో స్నేహితలతో కలిసి అలా సరదాగా గడిపేందుకు ముంబై వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా సర్కారు వారి పాటతో కీర్తీ చేతిలో ‘గుడ్ లక్ సఖీ’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో పాటు మలయాళంలో వాశి అనే మూవీలో నటిస్తుంది.
చదవండి: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..