
నాగవంశీ, కీర్తీ సురేష్, నితిన్, వెంకీ అట్లూరి
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బ్రేక్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించారు. ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం అని తెలిపారు నితిన్. ‘‘రంగ్ దే’ తాజా షెడ్యూల్‌ను అన్ని జాగ్రత్తలతో సురక్షితంగా పూర్తి చేశాం’’ అని చిత్రబృందంతో దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేశారు నితిన్. నెక్ట్స్ పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లనున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment