
Keerthy Suresh In Sharwanand, Krishna Chaitanya Movie: యంగ్ హీరో శర్వానంద్‌ను వరస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. ఇటీవల అతడు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఎన్నో అంచాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో శర్వానంద్‌కు జోడిగా రష్మిక నటించగా.. అలనాటి తారలు, సీనియన్ హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, ఖుష్బూ సుందర్, ఊర్వశిలు ప్రధాన పాత్రల్లో కనిపించప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని తదుపరి చిత్రం కోసం దర్శకుడు కృష్ణ చైతన్యతో జతకట్టాడు శర్వానంద్.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో శర్వా కోసం ఈ కథను సిద్ధం చేశాడు కృష్ణ చైతన్య. ఇక ఈ మూవీలో హీరోయిన్ కోసం తొలుత చిత్రం బృందం కృతిశెట్టిని సంప్రదించగా తను నో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ తల్లి పాత్ర పోషించాల్సి ఉంది. దీంతో కెరీర్ ప్రారంభంలోనే తాను మదర్ క్యారెక్టర్స్ చేయననని చెప్పినట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నారు. దీంతో ఈ క్యారెక్టర్ కోసం కీర్తిసురేశ్‌ను అడగ్గా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చివరకు ఈ మూవీలో కీర్తిని హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే కృతి నో చెప్పిన ఈ పాత్రకు కీర్తి ఒకే చెప్పడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సాధారణంగా యంగ్ హీరోయిన్లు చెల్లి, తల్లి పాత్రలు చేసేందుకు అసలు అంగీకరించరు. కానీ కీర్తి మాత్రం తన దగ్గర వచ్చిన మంచి ప్రాజెక్ట్స్‌ను మాత్రం అసలు వదలుకోవడం లేదు. ఏలాంటి పాత్ర అయిన అది మంచి, భిన్నమైన స్క్రిప్ట్ అయితే చాలు చేస్తానంటుంది. ఇప్పటికే ఆమె అన్నాత్తైలో రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించగా.. భోళా శంకర్‌లో చిరంజీవికి కూడా సోదరిగా కనిపించనుంది. అంతేకాదు ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్’ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment