పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్‌ ఒత్తిడి ? | Keerthy Suresh Under Pressure From Parents To Get Married? | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్‌ ఒత్తిడి ?

Published Tue, Dec 29 2020 2:21 PM | Last Updated on Thu, Apr 14 2022 1:02 PM

Keerthy Suresh Under Pressure From Parents To Get Married? - Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ  ఏడాది మార్చిలోనూ కీర్తి ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా కీర్తి పేరేంట్స్‌ కూడా ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట. త్వరలోనే ఆమెకు పెళ్లి చేయాలని భావిస్తున్న కీర్తి కుటుంబ సభ్యులు అందుకోసం సంబంధాలు వెతికే పనిలో పడ్డట్లు సమాచారం. అయితే కీర్తి మాత్రం తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పినట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె మరికొంతకాలం యాక్టింగ్‌ కెరియర్‌ను కంటిన్యూ చేస్తానని పేర్కొన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతానికి పెళ్లి ప్రణాళికలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. (కీర్తి సురేష్‌కు వెడ్డింగ్‌ బెల్‌? )

నటి మేనక, సురేష్‌కుమార్‌ దంపతుల ముద్దుల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ కోలీవుడ్‌లో ‘ఇడు ఎన్నా మాయం’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. కాగా ‌ఈ ఏడాది ఆమె  నటించిన పెంగ్విన్‌, మిస్‌ ఇండియా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్‌ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కుకునూర్‌ నగేశ్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 'గుడ్‌ లక్‌ సఖి' అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే తెలుగులో నితిన్‌ సరసన  'రంగ్ ‌దే', మహేష్‌కు జోడీగా 'సర్కారు వారి పాట' సినిమాల్లో కనిపించనున్నారు. (ద‌ర్శ‌కుడిని ప‌రిగెత్తించి మ‌రీ కొట్టిన కీర్తి సురేశ్ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement