Sarkaru Vaari Paata: Kalavathi Song Cross 100 Million Views In Youtube, Video Viral - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: యూట్యూబ్‌లో ‘కళావతి’ సరికొత్త రికార్డు

Mar 22 2022 5:26 PM | Updated on Mar 22 2022 6:25 PM

Sarkaru Vaari Paata: Kalavathi Song Cross 100 Million Views In Youtube - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘కళావతి’ అనే సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 100 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ని సాధించి, రికార్డు సృష్టించింది. 

 విడుదలైన తొలి రోజు నుంచే ఈ మెలోడీ సాంగ్‌ జనాల్లోకి దూసుకెళ్లింది. ఏ ఫంక్షన్‌లో చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో మహేశ్‌బాబు వేసిన స్టెప్పులు యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేశాయి.ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్​ రీల్స్​ చేసి అలరించారు. ఈ మెలోడీ సాంగ్‌కి అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, సిద్‌ శ్రీరామ్‌ తనదైన శైలీలో ఆలపించారు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘పెన్నీ సాంగ్‌’సాంగ్‌ కూడా ‍యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement