సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నేను శైలజతో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తి.. కెరీర్ ఆరంభమైన కొన్నాళ్లకే 'మహానటి'గా నిరూపించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. అయితే, తాజాగా రఘు తాత నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అదే రోజున పాన్ ఇండియా చిత్రం అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా విడుదల కానుంది.
'మహానటి' చిత్రానికి గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంటే.. అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న పుష్ప, రఘు తాత రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఇద్దరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న స్టార్స్ ఒకేరోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. వాస్తవానికి కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 కూడా ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ, పుష్ప 2 వల్ల దానిని విరమించుకున్నారు. అయితే, రఘు తాత చిత్రంతో కీర్తి సురేష్ బన్నీ సినిమాకు పోటీగా రేసులోకి దిగుతుంది.
ఈ చిత్రంలో ఆమె NCC క్యాడెట్ శిక్షణలో ఉంటుంది. హిందీలో శిక్షణ ఇస్తుంటే తనకు హిందీ రాదని తమళంలో చెప్పాలని కోరుతుంది. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ ఇప్పటికే తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌లో రఘు తాత చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment