
నితిన్
ఏదైనా భాషలో హిట్ అయిన చిత్రాన్ని తమ ఆడియన్స్‌కి చూపించాలనుకుంటారు వేరే భాషల ప్రముఖులు. రీమేక్ చేస్తే ‘ఫ్లేవర్’ పోతుందనిపిస్తే అనువదించి, విడుదల చేస్తారు. లేకపోతే రీమేక్ చేస్తారు. ఇప్పుడు నితిన్ ఓ తమిళ సినిమాకు తెలుగు నేటివిటీ దట్టించి రీమేక్ చేయాలనుకుంటున్నారని టాక్. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘రాక్షసన్’ రీమేక్ రైట్స్‌ను నితిన్ తీసుకున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ తమిళనాట ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తోంది. కథ, కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నితిన్ నటించాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment