Vijay Sethupathi And Vishnu Vishal Idam Porul Yaeval Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన విజయ్‌ సేతుపతి, విష్ణు విశాల్‌ చిత్రం

Published Thu, Oct 27 2022 10:44 AM | Last Updated on Thu, Oct 27 2022 12:58 PM

Finally Vijay Sethupathi, Vishnu Vishal Idam Porul Yaeval Movie Coming to Theaters Soon - Sakshi

విజయ్‌ సేతుపతి, విష్ణు విశాల్, నటి ఐశ్వర్య రాజేశ్‌, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇడమ్‌ పొరుళ్‌ ఎవల్‌’. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు శీను రామస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో సుభాష్‌ చంద్రబోస్‌ నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2014లోనే విడుదల కావాల్సింది. అయితే ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయింది. కాగా న్యాయస్థానం ఆదేశంతో 8 ఏళ్ల తరువాత ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది.

దీంతో చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. నిజానికి ఈ చిత్రంపై అప్పట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కారణం దర్శకుడు శీను రామస్వామి కావడమే. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి వస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లకు విముక్తి కలిగింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేదీ? అది థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా? అన్న విషయంలో మేకర్స్‌ నుంచి క్లారిటీ రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement