విపరీతమైన ఒళ్లు నొప్పులు, జ్వరం: విష్ణు విశాల్‌ | Vishnu Vishal Tests Coronavirus Positive, Complains Fever, Nose Block | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముక్కు పని చేయడం లేదు

Published Sun, Jan 9 2022 2:18 PM | Last Updated on Sun, Jan 9 2022 2:21 PM

Vishnu Vishal Tests Coronavirus Positive, Complains Fever, Nose Block - Sakshi

తమిళ నటుడు విష్ణు విశాల్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం నాడు ట్విటర్‌లో వెల్లడించాడు. '2022.. 'పాజిటివ్‌' రిజల్ట్‌తో ప్రారంభించాను. అవును, నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. గడిచిన వారం రోజుల్లో నన్ను కలిసినవాళ్లందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఒళ్లు నొప్పులున్నాయి, ముక్కు పనిచేయడం లేదు. గొంతుమంటగా ఉంది. అలాగే జ్వరం కూడా వచ్చింది. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడతానని అనుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశాడు.

కాగా అతడు జనవరి 7న మాస్‌ మహారాజ రవితేజతో దిగిన ఫొటో షేర్‌ చేశాడు. దీంతో విష్ణు రెండు రోజుల క్రితం రవితేను కలిశాడా? అంటూ అభిమానులు ఆరా తీయగా దీనిపై స్పందించిన విష్ణు అది పాత ఫొటో అని, భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అతడు చివరగా 'అరణ్య' సినిమాలో కనిపించాడు. విష్ణు నటించిన ఎఫ్‌ఐఆర్‌, మోహన్‌దాస్‌ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement