యాక్షన్​ థ్రిల్లర్​గా 'ఎఫ్​ఐఆర్'​.. ట్రైలర్​ రిలీజ్​ చేసిన నాని | Vishnu Vishal FIR Movie Trailer Released By Hero Nani | Sakshi
Sakshi News home page

FIR Movie: యాక్షన్​ థ్రిల్లర్​గా 'ఎఫ్​ఐఆర్'​.. ట్రైలర్​ రిలీజ్​ చేసిన నాని

Published Fri, Feb 4 2022 10:27 AM | Last Updated on Fri, Feb 4 2022 10:31 AM

Vishnu Vishal FIR Movie Trailer Released By Hero Nani - Sakshi

Vishnu Vishal FIR Movie Trailer Released By Hero Nani: విష్ణు విశాల్‌ హీరోగా మను ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ఐఆర్‌'. విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నెచురల్​ స్టార్​ నాని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌. ఇర్ఫాన్‌ అహ్మద్‌ పాత్రలో విష్ణు విశాల్‌ ఈజ్‌తో నటించారు. తీవ్రవాదులను  నిర్మూలించే ఆఫీసర్‌ పాత్రను డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ చేశారు' అన్నారు.

2 నిమిషాల 12 సెకండ్లు రన్​టైమ్​ ఉన్న ఎఫ్​ఐఆర్ ట్రైలర్​ ఆలోచింపజేసేలా ఉంది. అబూ బక్కర్​ అబ్దుల్లా అనే భయంకరమైన టెర్రరిస్ట్​ కారణంగా ఇర్ఫాన్​ అహ్మద్​ అనే యువకుడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేదే మూవీ కథగా తెలుస్తోంది. విష్ణు విశాల్​, రేబా మోనికా జాన్​ల కెమిస్ట్రీ బాగుండడంతోపాటు గౌతమ్​ వాసుదేవ్​ మీనన్ యాక్టింగ్​ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అరుల్​ విన్సెంట్​ కెమెరా వర్క్​, అశ్వంత్ సంగీతం ఆకుట్టుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement