ఓటీటీలో కోలీవుడ్‌ హీరో FIR మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | Vishnu Vihsal Fir Movie Will Stream On Amazon Prime | Sakshi
Sakshi News home page

Fir Movie : ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఎఫ్‌ఐఆర్‌'.. ఎప్పుడంటే

Published Fri, Mar 4 2022 8:54 PM | Last Updated on Fri, Mar 4 2022 8:56 PM

Vishnu Vihsal Fir Movie Will Stream On Amazon Prime - Sakshi

కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌ రీసెంట్‌గా నటించిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌. ఫిబ్రవరి 11న తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈనెల 11నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. మను ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విష్ణు విశాల్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.

తెలుగులో రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా విడుదల చేశారు.ఇందులో డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ పోలీసు అధికారిగా నటించగా, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement