ఇతడే నా వేలంటైన్‌ | Jwala Gutta And Vishnu Vishal romantic photo turns viral | Sakshi
Sakshi News home page

ఇతడే నా వేలంటైన్‌

Published Sun, Feb 16 2020 3:37 AM | Last Updated on Sun, Feb 16 2020 3:37 AM

Jwala Gutta And Vishnu Vishal romantic photo turns viral - Sakshi

గుత్తా జ్వాల,విష్ణు విశాల్

వేలంటైన్స్‌ డే సందర్భంగా ఓ సందేహాన్ని క్లియర్‌ చేశారు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల.  తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్‌ చేసుకోవడం, సోషల్‌ మీడియాలో సెల్ఫీలు పోస్ట్‌ చేయడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. వేలంటైన్స్‌ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి ‘ఇతడే నా వేలంటైన్‌’ అని రాశారు జ్వాల. 2011లో భర్త చేతన్‌ ఆనంద్‌ నుంచి గుత్తా జ్వాల, 2018లో భార్య రజనీ నటరాజ్‌ నుంచి విష్ణు విశాల్‌ విడిపోయారు. మరి.. ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement