Vishnu Vishal: Turns Emotional At FIR Trailer Launch Deets Inside - Sakshi
Sakshi News home page

Vishnu Vishal: తండ్రి మాటలకు హీరో విష్ణు విశాల్‌ భావోద్వేగం

Published Sat, Feb 5 2022 3:11 PM | Last Updated on Sat, Feb 5 2022 4:58 PM

Vishnu Vishal Turns Emotional At The Fir Trailer Launch - Sakshi

Vishnu Vishal Turns Emotional At The FIR Trailer Launch: అరణ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్‌ హీరో విష్ణు విశాల్‌. తాజాగా మను ఆనంద్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ఎఫ్‌ఐఆర్‌ చిత్రం​ త్వరలోనే తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విష్ణు విశాల్‌ తండ్రి, పోలీస్‌ అధికారి రమేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్‌కి గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉంది. నా కొడుకు వల్లే ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారందరికి కృతజ్ఞతలు. వాళ్ల అభిమానం, ప్రేమ నా కొడుకుపై ఎప్పుడూ ఉండాలి. ఎఫ్ఐఆర్ సినిమా చూశాను.

నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే తండ్రి మాటలకు హీరో విష్ణు విశాల్‌ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement