విష్ణు విశాల్
కేరళలో ఉన్న బందేవ్ నెక్ట్స్ ఢిల్లీ వెళతాడట. అంతకు ముందు బందేవ్ థాయ్‌ల్యాండ్ నుంచి కేరళకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ.. బందేవ్ అంటే గుర్తుండే ఉంటుంది. అదేనండీ.. ‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర పేరే బందేవ్. తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా ప్రకృతి, ఏనుగులతో మనుషుల సాన్నిహిత్యం నేపథ్యంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఇంకా తెలుగు, తమిళ టైటిల్స్‌ను ప్రకటించాల్సి ఉంది. తెలుగులో ‘అడవి రాముడు’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళ నటుడు విష్ణు విశాల్ తమిళ, తెలుగు వెర్షన్స్‌లో కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘మున్నార్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశా. ప్రభు సాల్మన్‌గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాతో నేను తెలుగు తెరకు పరిచయం కానుండటం రొంబ (చాలా) హ్యాపీగా ఉంది. అలాగే తమిళ వెర్షన్‌కు ‘కుమ్‌కీ 2’ అనే టైటిల్ పెట్టబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. ఇది రీమేక్ కాదు. ఫ్రెష్ స్క్రిప్ట్’’ అన్నారు విష్ణు విశాల్. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment