విష్ణువిశాల్‌తో మంజిమా మోహన్
యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది నటుడు శింబు హీరోయిన్ . మాలీవుడ్ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ శింబు హీరోగా నటించిన అచ్చంయన్బదు మడమైయడా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందడంతో ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా క్షత్రియన్ చిత్రంలోనూ, ఉదయనిదిస్టాలిన్ సన ఇప్పడై వెల్లుమ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో క్షత్రియన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా విష్ణువిశాల్‌తో డ్యూయెట్లు పాడడానికి మంజిమామోహన్ మాచారం. విష్ణువిశాల్ ప్రస్తుతం కథానాయకన్ అనే చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు.
ఇందులో క్యాథరిన్ ట్రెసా నాయకి. మురుగానందం దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు, నటుడు దుష్యంత్ సొంతంగా ఈశన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్రం నిర్మాణం చేపట్టి ఇప్పటికే కాళిదాస్ జయరాం, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన మీన్ కుళంబుం మణŠ పానయం చిత్రాన్ని నిర్మించారు.తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇందులో విష్ణువిశాల్ హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా మలయాళ కుట్టి మంజిమామోహన్ నాయకిగా ఎంపికైంది.ఈ విషయాన్ని చిత్ర హీరో విష్ణువిశాల్ ధ్రువపరిచారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.