పట్టుచీర కట్టుకోమ్మా... | Ravi Teja and Bhagyashri Borse sizzle in Sitar song | Sakshi
Sakshi News home page

పట్టుచీర కట్టుకోమ్మా...

Published Thu, Jul 11 2024 3:56 AM | Last Updated on Thu, Jul 11 2024 3:56 AM

Ravi Teja and Bhagyashri Borse sizzle in Sitar song

‘చిట్టి గువ్వలాంటి చక్కనమ్మా... బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్‌ బచ్చన్‌’లోని ‘సితార్‌’ సాంగ్‌. రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. 

పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. బుధవారం ‘సితార్‌...’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. కశ్మీర్‌ వ్యాలీలో ఈ మెలోడీ డ్యూయెట్‌ను రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్‌లో చిత్రీకరించారు. చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ పాటకు సాహితి సాహిత్యం అందించగా సాకేత్, సమీరా భరద్వాజ్‌ పాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement