
‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు మేకర్స్.
‘‘మిస్టర్ బచ్చన్’ పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేస్తున్నాం. ఆగస్ట్ 14న ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఆగస్ట్ 19న రక్షా బంధన్ సెలవు ఉంటుంది. 5 రోజుల లాంగ్ వీకెండ్ మా మూవీకి ప్లస్ అవుతుందనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.