మాస్‌ మహారాజా 'మిస్టర్‌ బచ్చన్‌'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Ravi Teja Latest Movie Mr Bachchan Second Song Out Now | Sakshi
Sakshi News home page

Mr Bachchan: రవితేజ 'మిస్టర్‌ బచ్చన్‌'.. 'రెప్పల్‌.. డప్పుల్‌' అంటోన్న భాగ్యశ్రీ!

Published Thu, Jul 25 2024 7:07 PM | Last Updated on Thu, Jul 25 2024 7:59 PM

Ravi Teja Latest Movie Mr Bachchan Second Song Out Now

మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్.  ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇప్పటికే సితార్‌ అనే సాంగ్‌ను రిలీజ్‌ చేయగా.. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెప్పల్ డప్పుల్‌ అంటూ సాగే పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్‌ డే రోజున ఈ సినిమా రిలీజ్ కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement