
‘అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘జిక్కీ’. రవితేజ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సె కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాలోని ‘జిక్కీ...’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే... గట్టుదాటి గట్టిగానే కొట్టుకున్నదే... పట్టుపట్టి పిల్లా చెయ్యి పట్టుకున్నదే...’, ‘నా మనసే నీకే చిక్కి... దిగనందే మబ్బుల్ ఎక్కి... నీ బొమ్మే చెక్కి... రోజూ నిన్నే పూజించానే జిక్కీ...’ అనే లిరిక్స్‌తో ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో వనమాలి సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, రమ్య బెహరాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment