రవితేజ కోహినూర్‌? | Ravi Teja RT75 to be titled Kohinoor | Sakshi
Sakshi News home page

రవితేజ కోహినూర్‌?

Published Mon, Aug 12 2024 12:53 AM | Last Updated on Mon, Aug 12 2024 12:53 AM

Ravi Teja RT75 to be titled Kohinoor

‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల మరో సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో ‘సామజవరగమన’ వంటి హిట్‌ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. 

ూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాకు ‘కోహినూర్‌’ అనే టైటల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ‘కోహినూర్‌’ను వర్కింగ్‌ టైటిల్‌గా పెట్టుకుని యూనిట్‌ వర్క్‌ చేస్తోందని, త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement