స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్‌లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్
రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్
యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.
తంగలాన్ కలెక్షన్స్
ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment