మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల | Ravi Teja Mr Bachchan Movie Second Song Jikki Lyrical Video Song Out Now, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jikki Lyrical Video Song: మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

Aug 2 2024 7:11 PM | Updated on Aug 2 2024 7:48 PM

Ravi Teja Mr Bachchan Movie Second Song Out Now

రవితేజ టైటిల్‌ రోల్‌లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్‌ బచ్చన్‌.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.  పనోరమా స్టూడియోస్‌– టీ సిరీస్‌ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ సంగీతం నుంచి మరో సాంగ్‌ రిలీజ్‌ అయింది.

ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్‌ ఫిల్మ్‌ అజయ్‌ దేవగన్  ‘రైడ్‌ ’(2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్‌ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని డైరెక్టర్‌ శంకర్‌ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత ఇదే కామెంట్‌ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. కాన్సెప్ట్‌ రైడ్‌ సినిమా కావచ్చునేమో కానీ, ఆయన తెరకెక్కించే తీరు మాత్రం ప్రత్యేకతను తప్పకుండా చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement