
ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్ అంటున్నారు మిస్టర్ బచ్చ న్ . హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేష న్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చ న్ ’. ‘నామ్ తో సునాహోగా’ అనేది ట్యాగ్‌లై న్ . భాగ్యశ్రీ బోర్సే హీరోయి న్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టాకీ పార్ట్ చిత్రీకరణ జరిపారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఈ వారంలో అమెరికా వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హరీష్ శంకర్ ఆల్రెడీ అమెరికా వెళ్లి లొకేష న్ ్స పరిశీలిస్తున్నారని తెలిసింది. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరకర్త. ఇదిలా ఉంటే హిందీ హిట్ మూవీ ‘రైడ్’ (2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చ న్ ’ తెరకెక్కుతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment