
నితిన్(Nithiin) హీరోగా నటించిన రాబిన్‌హుడ్ (Robinhood) సినిమాలోని ‘అదిరా సర్‌ప్రైజ్’ పాట ఎంత వైరల్ అయిందే.. ఆ స్టెప్పులు అంతే కాట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఈ పాటలో కేతికా శర్మతో వేయించిన స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఒక అమ్మాయితో అలాంటి స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్యాస్టూమ్స్‌పై కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఇలాంటి అసభ్యకరమైన స్టెప్పులను నిలిపివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అయితే కొంతమంది మాత్రం ఆ స్టెప్పులను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హుక్ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అదిరా సర్‌ప్రైజ్ అయితే సినిమాకు బజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట కాంట్రవర్సీ గురించి నితిన్ స్పందించాడు. అసలు ఆ పాట షూటింగ్ సమయంలో తాను లేనని, ట్రోల్స్ చూసిన తర్వాతే తనకు ఆ స్టెప్పుల గురించి అర్థమైందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అదిరా సర్‌ప్రైజ్ సాంగ్‌లో నేను లేను. షూటింగ్ సమయంలో కూడా నేను చూడలేదు. సాంగ్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. కొంతమంది ఆ స్టెప్పు గురించి నెగెటివ్ కామెంట్ చేశారు. మేం అందరి అభిప్రాయలను గౌరవిస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను ఆ స్టెప్పుల గురించి పెద్దగా పట్టించుకోలేదు.
సినిమా బాగొచ్చిందనే ఆనందంలో ఉండిపోయి..పాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రోల్స్ చూసిన తర్వాత నాక్కుడా ఆ పాటకి వేసిన స్టెప్పుల గురించి అర్థమైంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కానీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కాగా ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఇక రాబిన్‌హుడ్ విషయానికొస్తే.. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment