శ్రీలీల బర్త్‌ డే.. స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసిన టీమ్! | Sreeleela Birthday Special Glimpse Released By ROBINHOOD Team | Sakshi
Sakshi News home page

Sreeleela Birthday Special: శ్రీలీల బర్త్‌ డే.. స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసిన టీమ్!

Published Fri, Jun 14 2024 4:06 PM | Last Updated on Fri, Jun 14 2024 4:14 PM

Sreeleela Birthday Special Glimpse Released By ROBINHOOD Team

పెళ్లిసందడి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆ తర్వాత రవితేజ ధమాకా, వైష్ణవ్‌ తేజ్ ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రవితేజ సరసన మరో సినిమాకు సిద్ధమైంది. దీంతో నితిన్‌తో మరోసారి జతకట్టింది. నితిన్ సరసన రాబిన్‌హుడ్‌ చిత్రంలో కనిపించనుంది.

తాజాగా ఇవాళ శ్రీలీల బర్త్‌ డే కావడంతో రాబిన్‌హుడ్‌ టీమ్‌ ‍స్పెషల్ విషెస్ తెలిపారు. శ్రీలీల బర్త్‌ డే స్పెషల్ గ్లింప్స్‌ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో శ్రీలీల, వెన్నెల కిశోర్‌ మధ్య ఫన్నీ డైలాగ్‌ నవ్వులు తెప్పిస్తోంది. 'సునామీలో టీ సైలెంట్‌గా ఉండాలి.. నా వద్ద నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అంటూ వెన్నెల కిశోర్‌కు శ్రీలీల వార్నింగ్‌ ఇస్తుంది. గ్లింప్స్‌ చూస్తుంటే ఈ చిత్రంలో శ్రీలీల గ్లామరస్‌ లుక్స్‌తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement