![Bigg Boss Telugu 7: Prince Yawar Vs Gautam Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/15/Prince%20Yawar.jpg.webp?itok=Tb_FFNOk)
బిగ్‌బాస్ 7 ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఆటలో చూపించాల్సిన ప్రతాపాన్ని ఖాళీ సమయాల్లోనే ఎక్కువగా చూపిస్తున్నారు. కొందరైతే ఫుటేజీ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో మాయాస్త్ర టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా! మహాబలి టీమ్‌లో గొడవల కారణంగా టాస్క్ కొనసా...గుతోంది. ఈ టాస్క్ గురించి అప్‌డేట్ ఇస్తూ తాజాగా ప్రోమో విడుదలైంది.
కొట్టుకున్నంత పని చేసిన గౌతమ్, ప్రిన్స్
మాయాస్త్ర పొందేందుకు ఎవరు అనర్హులో చెప్పి, వారి దగ్గరున్న భాగాన్ని తీసుకుని అదే టీమ్‌లోని మరొకరికి ఇవ్వాలి. దీంతో గౌతమ్.. ప్రిన్స్ దగ్గరి నుంచి తీసుకుని శివాజీకి ఇస్తానన్నాడు. ఆ మాటతో శివాలెత్తాడు ప్రిన్స్. నువ్వు చెప్పే కారణం ఇదా.. అని అరిచాడు. గౌతమ్, ప్రిన్స్ యావర్.. ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. నాకు న్యాయం కావాలని ఏడ్చేశాడు ప్రిన్స్. దీంతో అమర్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడుతారో నాకర్థం కాదు అని మహాబలి టీమ్‌పై సెటైర్లు వేశాడు.
రైతుబిడ్డ అని చెప్పుకోవద్దు, కానీ నువ్వు డాక్టర్ అని చెప్పుకోవచ్చు
'ఇది బ్యాడ్ గేమ్.. నేను ఇంటికి వెళ్లాలి.. గేటు ఓపెన్ చేయండి' అని అభ్యర్థించాడు ప్రిన్స్. ఈ ప్రోమో చూసిన అభిమానులు.. ప్రిన్స్ యావర్ కష్టపడే తత్వమున్నవాడని, అతడు నిజాయితీగా ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అని చెప్పుకుంటే తిట్టారు, మరి గౌతమ్ ఎందుకు? పదేపదే డాక్టర్‌నని విర్రవీగుతున్నాడు. ఆయన అన్నిసార్లు డాక్టర్ అని చెప్పుకుంటుంటే ఎవరూ నోరు మెదపడం లేదేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ చేస్తే తప్పు, గౌతమ్ చేస్తే ఒప్పా? అని నిలదీస్తున్నారు.
చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్ బ్యాచ్ అవుట్.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్
Comments
Please login to add a commentAdd a comment