నామినేషన్స్‌లో ట్విస్ట్‌.. కొత్తవాళ్లకే ఛాన్స్‌! ఒక్కొక్కరికీ ఉంటదీ.. | Bigg Boss Telugu 7: Sixth Week Nominations List | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌ ప్రక్రియ.. అమర్‌, తేజలకు..

Published Mon, Oct 9 2023 11:10 AM | Last Updated on Mon, Oct 9 2023 11:33 AM

Bigg Boss Telugu 7: Sixth Week Nominations List - Sakshi

బిగ్‌బాస్‌.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్‌మేట్స్‌కు నిన్న ఒక్కసారిగా ఝలక్‌ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి దించాడు. వీరితోనూ ఆడి గెలవాలని ఛాలెంజ్‌ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్‌బాస్‌. తాజాగా రిలీజైన ప్రోమో పోటుగాళ్లు మాత్రమే నామినేట్‌ చేస్తారని ట్విస్ట్‌ ఇచ్చాడు.

ఇంకేముంది, హౌస్‌లో ఉన్న ఆటగాళ్లంతా చేసేదేం లేక బిక్కమొహం వేసుకుని కూర్చున్నారు. నామినేట్‌ చేయాలనుకునేవారి ముఖంపై ఎక్స్‌ మార్క్‌ వేసి అందుకు తగిన కారణాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా నయని పావని.. తేజ గేమ్‌ ఆడినట్లు కనిపించలేదని తనను నామినేట్‌ చేశాడు. గౌతమ్‌ను బెల్ట్‌తో కొట్టిన విషయంపై తేజను పూజా మూర్తి నామినేట్‌ చేసింది. స్వార్థంగా ఆలోచిస్తున్నావంటూ అమర్‌దీప్‌ ముఖంపై ఎక్స్‌ మార్క్‌ వేసింది అశ్విని శ్రీ. తర్వాత శోభా శెట్టిని నామినేట్‌ చేసింది.

అయితే పదేపదే గ్రూపిజం అనడంతో తట్టుకోలేకపోయింది శోభా. ఏంటి గ్రూపిజం? గ్రూపిజం వల్ల మీరు నష్టపోయారా? వేరేవాళ్లు నష్టపోయారా? అని ఫైర్‌ అయింది. ఇకపోతే మొదట పోటుగాళ్లకు ఛాన్స్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ తర్వాత ఆటగాళ్లకు ఇతరుల్ని నామినేట్‌ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్‌దీప్‌, సందీప్‌, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement