
అనంతపురం అబ్బాయే అమర్‌దీప్. విదేశాల్లో చదువుకున్న ఇతడికి సినిమాలపై ఆసక్తి ఉండేది. మొదట 'పరిణయం' అనే షార్ట్ ఫిలిం చేయగా అది బాగా క్లిక్ అవడంతో ఆఫర్స్ వచ్చాయి. అలా యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ చేశాడు. అక్కడి నుంచి సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేశాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు.
జనాల్లో పాపులారిటీ పెరగడంతో సీరియల్ హీరోగా మారాడు. అప్పుడప్పుడూ షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం సినిమాలు కూడా చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు అమర్‌దీప్. అయితే బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఐదో సీజన్‌లోనే ఇతడు దగ్గరయ్యాడు.
అప్పుడు మానస్‌కు సపోర్ట్ చేసేందుకు బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడు అమర్. తన మాటలతో, ప్రవర్తనతో అందరికీ నచ్చేశాడు. ఇతడు నెక్స్ట్ సీజన్‌లో రావడం ఖాయం అనుకున్నారంతా! కానీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు షోలో అడుగుపెట్టాడీ బుల్లితెర హీరో. గతేడాది నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్న అమర్ భార్యతో కలిసి షోలో పాల్గొంటాడునుకున్నారు. కానీ చివరకు ఒక్కడే వచ్చేశాడు.