బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషనల్‌గా సాగుతోంది. వచ్చిన కుటుంబసభ్యులను చూసి కంటెస్టెంట్లు ఓపక్క సంతోషంతో ఎగిరి గంతేస్తూ మరోపక్క ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు బాధతో ఒక్కసారిగా ఏడ్చేస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ హౌస్‌మేట్స్‌కు ఏదో ఒక హింట్ ఇచ్చే వెళ్తున్నారు. ఈరోజు హౌస్‌లోకి అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మరి వారు ఏమేం హింట్స్ ఇచ్చారు? హౌస్‌లో ఏం జరిగిందనేది తాజా(నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అమర్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
బిగ్‌బాస్ అమర్‌ను ఓ ఆటాడుకున్నాడు. నీ భార్య తేజస్వి రావడం లేదని, తను నీ బర్త్‌డే కోసం కేక్ పంపించిందని దాన్ని అతడికి అప్పగించాడు. సరే, ఏం చేద్దాం.. కేక్‌తో తృప్తిపడదాం అని దిగాలుగా కన్ఫెషన్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన అమర్‌కు స్వీట్ షాక్ తగిలింది. ఎదురుగా తేజస్విని కనిపించింది. నోట మాటలు రాక భార్యను ఆప్యాయంగా హత్తుకున్నాడు. తేజు అయితే భర్త స్పర్శ తగలగానే ఏడ్చేసింది. తర్వాత తేజును తన బెడ్ దగ్గరకు తీసుకెళ్లిన అమర్.. చాలా ఆలోచించా.. ఇంకోసారి పెళ్లి చేసుకుందామా? అనడంతో తేజు సిగ్గుపడిపోయింది.
ప్రశాంత్ నా తమ్ముడైపోయాడు..
తర్వాత ఇంటిసభ్యుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అమర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది తేజు. తమ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను మరోసారి భర్త వేలికి తొడిగింది. అనంతరం ప్రశాంత్ గురించి తేజుతో ఓ మాటన్నాడు. హౌస్‌లో మొదట వీడితోనే గొడవైంది.. కానీ ఇప్పుడు తమ్ముడైపోయాడని రైతుబిడ్డను హగ్ చేసుకున్నాడు. వదిన.. అన్న విషయంలో ఏమైనా అంటే ఏమనుకోకండి అని ప్రశాంత్ చెప్పగా.. వీడు కూడా ఏదైనా అంటే ఏమనుకోకు.. అమర్ చిన్నపిల్లాడిలానే.. అని చెప్పుకొచ్చింది.
నీకు తెలియకుండానే చిక్కుల్లో పడుతున్నావ్..
ఇక అమర్‌ను పక్కకు తీసుకెళ్లి.. ఒంటరిగా ఆడు. ఎవరేం చెప్పినా నమ్మవద్దు. నువ్వు నీ కోసం ఆడు, ఎవరూ నీకోసం లేరు. అది గుర్తుపెట్టుకో.. ఫినాలే వచ్చే టైమ్‌కు నువ్వు ముందుకు వెళ్లురా, నేను బయటకు వెళ్లిపోతా అని ఎవరైనా త్యాగం చేస్తారా? అందరూ వాళ్ల గేమ్ కోసం వచ్చారు. అలాగే కొన్నిసార్లు నువ్వు తెలియకుండానే ఇరుక్కుంటున్నావ్.. అవి చూసుకో అని సలహాలు ఇచ్చింది. తర్వాత ఎంగేజ్‌మెంట్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. బిగ్‌బాస్ రొమాంటిక్ సాంగ్ ప్లే చేయడంతో తేజును ఎత్తుకుని డ్యాన్స్ చేశాడు అమర్. తర్వాత శివాజీ కాళ్ల మీద పడి ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు.
తినడానికి తిండి లేక బాధపడ్డ శోభ
తేజు వెళ్లిపోయిన కాసేపటికి శోభా శెట్టి తల్లి హౌస్‌లోకి వచ్చింది. అమ్మను చూడగానే చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆ తల్లి కూడా అందరినీ దగ్గరకు తీసుకుంది. అలాగే ప్రిన్స్ యావర్‌కు తన తల్లి ఫోటోను బహుమతిగా ఇచ్చింది. ఇక కూతురితో 'కోపం ఎక్కువ కాకూడదు. గేమ్ ఓడిపోతే ఏడవకూడదు. పాత విషయాలు గుర్తు చేసుకో.. అప్పుడు తినడానికి తిండి కూడా లేక బాధపడ్డాం.. ఎంత కష్టపడ్డావో గుర్తు చేసుకుని ఆడు' అని కన్నీళ్లతో సలహా ఇచ్చింది. వెళ్లేముందు కూతురికి టెడ్డీబేర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది.
తోలుబొమ్మలా ఉన్నావ్..
తర్వాత ప్రిన్స్ యావర్ అన్నయ్య హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఎమోషనల్ అయి అందరినీ ఏడిపించేసిన ఇద్దరూ తర్వాత ఆట గురించి మాట్లాడారు. నువ్వు ఫైటర్.. టైగర్.. ఆటలో పక్కకు వెళ్లిపోకు.. ఫైటలర్ ఫైట్ చేయు. నాకు ఆ కప్పు కావాలి, వేరే ఏదీ వద్దు. ఈ మధ్య నీ ఆట చూసి కొంచెం ఫీలయ్యా. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్ నాకు మళ్లీ కావాలి. నీ అమాయకత్వం, ప్రేమ అసలు వదులుకోకు.. ఎక్కడా దారి మారకు. నేను ఏం చెప్తున్నానో అది కచ్చితంగా పాటించు. అందరూ దృష్టి పెట్టి ఆడుతున్నారు, నువ్వు తప్ప! ఇప్పుడొక తోలుబొమ్మలా ఉన్నావు.. వేరేవారి మాటలు వింటూ అటూఇటూ తిరుగుతున్నావ్.. ఎవరైతే జనాలు ఇష్టపడ్డారో ఆ యావర్‌లా ఉండు' అని తమ్ముడిలో ఉత్తేజం నింపి వెళ్లిపోయాడు.
చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment