![Bigg Boss 7 Telugu: Amardeep Chowdary Suffering with this Health Issue - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/24/Suffering-with-this-Health-Issue_0.jpg.webp?itok=v7ejkUeC)
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అది అమర్‌కు మాత్రమే! శివాజీ పదేపదే అతడిని హేళన చేస్తూ తన మానసిక ధైర్యం కోల్పోయేలా మాట్లాడుతూ మెంటల్ టార్చర్ చేస్తున్నాడు. అమర్ పైకి నవ్వుతూ సరదాగా తీసుకుంటున్నా లోలోపల మాత్రం చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో ఆ బాధ, ఆవేశం అంతా కూడా కన్నీటి రూపంలో బయటకు తన్నుకొచ్చింది.
ఫిట్స్ వచ్చాయి..
అయినా సరే బిగ్‌బాస్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే తాజాగా హౌస్‌లో అమర్‌దీప్ అస్వస్థతకు లోనయ్యాడని, ఫిట్స్ వచ్చి పడిపోయాడని ప్రచారం జరుగుతోంది. అతడి ఆరోగ్యం బాలేకపోవడంతో మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి చికిత్స చేశారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని అతడి స్నేహితుడు, నటుడు నరేశ్ ధ్రువీకరించాడు. నరేశ్ మాట్లాడుతూ.. 'అతడికి ఫిట్స్ వచ్చాయంటూ వస్తున్న వార్తలు నిజమే! అతడికి నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నీతోనే డ్యాన్స్ షోలో శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమయ్యాడు.
అమర్ స్నేహితుడు, నటుడు నరేశ్
కండరాల ఎదుగుల లోపించింది
విశ్రాంతి తీసుకోకుండా పని చేయడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అక్కడికి వెళ్లాక మాకు తెలిసిందేంటంటే.. అమర్ శరీరంలో కండరాల ఎదుగుదల జీరో అయిపోయింది. రెండు నెలల నుంచి అతడికి మజిల్ గ్రోత్ లేదు. అది తనకు చాలా పెద్ద బ్యాక్‌డ్రాప్. బిగ్‌బాస్ షోకు వెళ్లే రెండు రోజుల ముందు మాత్రమే తను ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయాడు. తను ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు. సరిగా నిద్రపోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. అయినా అమర్ ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. గేమ్‌లోనూ ఆ సమస్యను లెక్క చేయకుండా బాగా ఆడుతున్నాడు' అని చెప్పుకొచ్చాడు నరేశ్.
చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment