బిగ్‌బాస్ షో షురూ అవడానికి ముందే ఎవరెవరు కంటెస్టెంట్లుగా వెళ్తున్నారనేది లీకైపోతుంది. ఇది ప్రతి సీజన్‌లో జరిగేదే! అయితే అప్పుడే విన్నర్ ఫలానా వాళ్లు అవ్వొచ్చు అని కూడా ఫిక్సైపోతుంటారు. తీరా హౌస్‌లోకి వెళ్లాక జనాల అంచనాలను తలకిందులు చేస్తూ ఆటలో వెనకబడిపోయినవాళ్లూ ఉన్నారు. ఈ సీజన్‌లోనూ అదే జరిగింది. ఈ సీజన్‌లో జనాలకు బాగా తెలిసిన వ్యక్తుల్లో అమర్‌దీప్ ఒకరు. తను హౌస్‌లోకి వెళ్తున్నాడనగానే అతడే విన్నర్ అని చాలామంది ఫిక్సయిపోయారు. అమర్ గెలుపు పక్కా అనుకున్నారు. కానీ అమర్‌దీప్ హౌస్‌లోకి వెళ్లాక అతడు ఆటగాడు కాదు వట్టి మాటగాడు అని తేలిపోయింది.
వరుస పరిణామాలతో అమర్ అప్‌సెట్
ప్రతిసారి తన ఆట మీద కన్నా పక్కవాళ్ల గెలుపు మీద పడి ఏడ్వడం, తొండాట ఆడటం, ప్రశాంత్ మీద అరిచేయడం.. ఇలా చాలా తప్పులు చేస్తూ పోయాడు. తనకు తెలియకుండానే విన్నర్ రేసు నుంచి వైదొలిగాడు. నాగ్ కోటింగ్‌కు తోడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా అమర్‌ను సైడ్ చేశాయి. నిన్నటి జీనియస్ టాస్కులోనూ అతడిని ఆట మధ్యలో నుంచి తప్పించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అమర్ చాలా అప్‌సెట్ అయ్యాడు. ఏకంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడిపోతున్నాడు.
దయచేసి ఆపేయండి..
నిజానికి అమర్ మంచి ఆటగాడు. టాస్కుల్లో కష్టపడి ఆడుతున్నాడు, కానీ కలిసిరావడం లేదు. ఇకపోతే నెట్టింట కొందరు అమర్ ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ వ్యతిరేకత చూసిన అమర్ తల్లి మనసు చివుక్కుమంది. కొడుకుపై వస్తున్న ట్రోలింగ్ గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. 'అమర్‌దీప్ గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. చాలా బ్యాడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ ఆపండి. అమర్‌దీప్ కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు. అమర్‌దీప్ మంచి నటుడు, డ్యాన్సర్.
నేనూ రైతుబిడ్డనే..
చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు అనవసరంగా అమర్‌దీప్‌ను బ్యాడ్ చేస్తున్నారు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి, ఇదే నేను కోరుకునేది! అమర్‌దీప్‌కు సపోర్ట్ చేయండి. రైతుల గురించి ఎవరూ ఎప్పుడూ చెడుగా మాట్లాడరు. రైతెప్పుడూ రాజే! నేను కూడా రైతు బిడ్డనే, అమర్ తండ్రి ఒక మెకానిక్. ఇక్కడ ఎవరూ పెద్ద స్థాయిలో లేరు. మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్లమే! అమర్‌కు పొగరు అంటున్నారు, లేదు.. తను చాలా మంచివాడు' అని చెప్తూ ఎమోషనలైంది.
చదవండి: ప్రశాంత్ వరస్ట్ కెప్టెన్.. తేల్చేసిన హౌస్‌మేట్స్.. కన్నీటితో బ్యాడ్జ్ వెనక్కిచ్చేసిన రైతుబిడ్డ!
Comments
Please login to add a commentAdd a comment