బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్, సుప్రీత సురేఖవాణి జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏం3 మీడియా అండ్ మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
అయితే ఇటీవల ఓ డాన్స్ షోలో అమర్‌దీప్ చౌదరి, తేజు విజయం సాధించారు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమర్‌దీప్ మూవీ షూటింగ్ లోకేషన్‌లోనే టీం సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమర్‌దీప్‌ను సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.
ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ..'నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే విజయం వస్తుందని అనడానికి నిదర్శనం ఇదే. ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా సాధ్యమైంది. అలాగే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల ,డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత, టేస్టీ తేజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment