బిగ్ బాస్ సీజన్‌లో రైతుబిడ్డ తర్వాత పోటీలో నిలిచిన కంటెస్టెంట్ అమర్‌దీప్. హౌస్‌లో ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించిన అమర్.. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచారు. రైతుబిడ్డతో చివరి వరకు పోటీపడిన అమర్‌దీప్ రన్నర్‌గా బయటికొచ్చాడు. అ?అయితే మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమర్.. అంతే సంతోషంగా బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరాడు.
కానీ ఊహించని విధంగా అతని కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్టూడియో బయట జరిగిన రాళ్లదాడితో అమర్ కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమర్‌దీప్ ఈ ఘటనపై తొలిసారి మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకీ అమర్‌దీప్ ఏమన్నారో తెలుసుకుందాం.
అమర్‌దీప్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడానికి ఏం లేదు. గెలవలేను అనుకున్నవాన్ని..గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఈ విషయంలో నేను ఫీల్ అవ్వాల్సిన లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఎంటంటే.. చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పాలని కూడా అనుకోలేదు. బాధలో ఉండిపోయాను' అని అన్నారు.
రాళ్లదాడిని ప్రస్తావిస్తూ..' కారు అద్దాలు పగలగొట్టారు.. బయటికి రా.. నీ అంతు చూస్తాం అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవరికీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. కారు అద్దం పగలగొట్టినప్పుడు ఆ గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజు మీద పడ్డాయి. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. రాళ్లదాడి వల్ల ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరినీ కోల్పోయేవాడినో నాకు తెలియదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అప్పుడే నేను గెలిచా..
ఇలాంటివీ ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకు కోపముంటే తిట్టండి పడతాను. కామెంట్స్ పెట్టండి చూస్తాను. ఇంకా కోపముంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు. నా కుటుంబాన్ని మొత్తం బాధపెట్టారు. అయినా నేను ఏది పట్టించుకోవడం లేదు. నేను అభిమానించే హీరో మాస్ మహారాజా రవితేజ గారే వచ్చి సినిమాలో అవకాశమిచ్చారు. అప్పుడే నేను గెలిచా. ఆ గెలుపుతోనే బయటికి వచ్చాను' అని అన్నారు.
చాలా బాధేసింది..
కారు దాడిపై స్పందిస్తూ.. 'కానీ ఆనందంతో బయటకు వస్తాననుకున్న నన్ను నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఆ విషయంలో చాలా బాధేసింది. అయిన ఫర్వాలేదు. ఆ దేవుడు, అభిమానుల దయవల్ల మా ఇంట్లో వాళ్లకి ఏం కాలేదు. నాకు ఏం అయినా ఫర్వాలేదు. మన ఫ్యామిలీ పక్కన ఉన్నప్పుడు దయచేసి ఆలోచించండి. కప్పుపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. దయచేసి ఇలా ఎవరిమీద ఇలా ప్రవర్తించకండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా. కానీ దయచేసి ఇలా మాత్రం ఎవరికీ చేయకండి. థ్యాంక్యూ ఆల్. అందరికీ ధన్యవాదాలు' అని వీడియోలో వెల్లడించారు. కాగా.. బిగ్‌బాస్ షో ముగిసిన అనంతరం అమర్‌దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment