'బిగ్‌బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్‌లో ఇకపై కష్టమే! | Bigg Boss 7 Telugu Day 29 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 29 Highlights: వెళ్తానని ఒకటే గోల.. ఎందుకు భరిస్తున్నారో?

Published Mon, Oct 2 2023 10:50 PM | Last Updated on Tue, Oct 3 2023 9:01 AM

Bigg Boss 7 Telugu Day 29 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ హౌసులో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ హడావుడి ఉంటుంది. ఈసారి కూడా అలానే జరిగింది. హౌస్ మేట్స్ అయినవాళ్లు తప్పించి అందరూ నామినేట్ అయ్యారు. అలానే పవరస్త్ర గెలుచుకునే విషయంలో కంటెస్టెంట్స్ అందరూ చివర్లో పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 29 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

శివాజీకి లగ్జరీ కట్
రతిక ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత శివాజీని లగ్జరీ రూమ్ నుంచి వేరే గదికి షిప్ట్ చేయాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేయడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే తనకి బెడ్ ఎక్కడ ఇవ్వాలని శోభా-ప్రశాంత్ మాట్లాడుతుండగా మధ్యలో తేజ ఎంటరయ్యాడు. దీంతో అతడితో శోభా గొడవపెట్టుకుంది. ఆ తర్వాత శివాజీ డీలక్స్ రూంలోకి వచ్చేశాడు. అదే టైంలో తేజని జైల్లో పెట్టారు. 

(ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!)

నామినేషన్స్ ఓకే ఓకే
సాధారణంగా నామినేషన్స్ అంటే బిగ్‌బాస్ హౌస్ అంతా హీటెక్కి పోవడం గ్యారంటీ. కానీ ఈసారి అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం జరగలేదు. ఏదో ఏదో అలా అలా జరిగినట్లు అనిపించింది. ఇంతకీ ఎవరు ఎవరెవరిని నామినేట్ చేశారనేది ఇప్పుడు చూద్దాం.

కంటెస్టెంట్స్ - నామినేట్ చేసినోళ్ల పేరు

  • శివాజీ - అమరదీప్, ప్రియాంక
  • ప్రియాంక - శివాజీ, యవర్
  • గౌతమ్ - అమరదీప్, శివాజీ
  • శుభశ్రీ - అమరదీప్, ప్రియాంక
  • యవర్ - అమరదీప్, ప్రియాంక
  • అమరదీప్ - శుభశ్రీ, శివాజీ
  • తేజ - గౌతమ్, యవర్

(ఇదీ చదవండి: మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ)

శివాజీ ఓవరాక్షన్
అయితే నామినేషన్స్స జరగడానికి ముందు ఓ సందర్భంలో మాట్లాడిన శివాజీ.. తనని వాళ్లందరూ విలన్‌లా చూడాలనుకున్నారు కానీ తానెప్పుడూ హీరోనే అని కాస్త అతిగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక నామినేషన్స్‌లోనూ అమరదీప్‌ని నామినేట్ చేసి అతడితో చాలాసేపు వాదన పెట్టుకున్నాడు. గ్రూపులు కడుతున్నారని, హౌస్‌లోకి రాకముందే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని వచ్చారని, ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడుతున్నారని అన్నాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఓ సందర్భంగా తాను బిగ్ బాస్ ప్రైజ్ గెలుచుకోవడానికి రాలేదని, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి వచ్చానని అన్నాడు. అంటే ఎలాను గెలవను, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి పోతానన్నట్లుగానే కామెంట్స్ చేశాడు.

చెప్పినా ఒప్పుకోవట్లేదు
గౌతమ్.. శివాజీని నామినేట్ చేస్తూ స్మైల్ ప్లీజ్ టాస్కులో తేజ, తనని అలా లాగుతుంటే కనీసం ఓ మాటయినా చెప్పొచ్చు కదా అని అడిగాడు. అయితే అప్పుడు తేజకి తను అలా చెప్పానని అన్నాడు. అయితే నిన్ననే దీనిపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు. గౌతమ్ లాగుతున్నప్పుడు అరిచాడే తప్ప తేజ లాగుతున్నప్పుడు శివాజీ అరవలేదని వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. కానీ శివాజీ మాత్రం తను అరిచానని మళ్లీ అదే పాట పాడుతున్నాడు. అలానే ఇందులో తనది తప్పుంటే ఎలిమినేట్ చేసేయండని కెమెరాల వంక చూస్తూ చెప్పాడు.
 తనది తప్పుంటే నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ అన్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

చిరాకు తెప్పిస్తున్న శివాజీ
నామినేషన్స్ లో శివాజీ గోల అనుకుంటే అది అయిపోయిన తర్వాత కూడా వెళ్లిపోతా, వెళ్లిపోతా అనే పాటనే పాడుతున్నాడు. 'అందరూ తొండాట ఆడుతున్నారు బిగ్‪‌బాస్ కూడా తొండి ఆడుతున్నాడని. నన్ను ఎందుకు హౌస్‌మేట్‌గా తీసేశాడు. వాళ్లు వాళ్లు అనుకుని నన్ను బయటకు పంపేశారు. ఇవన్నీ బిగ్‌బాస్‌కి తెలియవా? బయటేస్తే వేశారు కాఫీ కూడా ఇవ్వట్లేదు? దేనికి ఆడాలి? ఎవరిని ఎంటర్ టైన్ చేయాలి?' అని చిరాకు తెప్పించాడు. ఇంతలా అరుస్తుంటే బిగ్ బాస్ నిర్వహకులు ఎందుకు ఇంకా శివాజీని భరిస్తున్నారో అర్థం కావట్లేదు.

బిగ్‌బాస్ ట్విస్ట్
తతంగమంతా పూర్తయిన తర్వాత ఈ వారం.. హౌస్ నుంచి నామినేట్ అయిన వాళ్లలో తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారని బిగ్‌బాస్ చెప్పాడు. అలానే ఇప్పటివరకు పవరస్త్ర కోసం ఇన్నాళ్లు హౌస్‌మేట్స్ కష్టం బట్టి ఉండేది, ఇకపై ప్రేక్షకుల చేతుల్లో ఆ నిర్ణయం ఉంటుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈ వారం పవరస్త్ర గెలుచుకునేది ఎవరో.. బహుశా ఓటింగ్ ద్వారా ఆడియెన్స్ డిసైడ్ చేయబోతున్నారనమాట. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: 'బిగ్‪‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement