బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మాధురి మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నవంబర్ 4న ఆమె పార్ట్‌నర్ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజట! ఆయన పుట్టినరోజునాడు పక్కనలేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. అలా పిక్నిక్‌కు వెళ్లినట్లు బిగ్‌బాస్‌కు వెళ్లి ఇలా బర్త్‌డే సమయానికి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్ బజ్‌లో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.
ఎంట్రీ, ఎలిమినేషన్ అంతా మాధురి చేతిలోనే..
తాజాగా రిలీజైన బిగ్‌బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ శివాజీ మాట్లాడుతూ.. 100% తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు. నిజంగా వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? అని ముఖం మీదే అడిగేశాడు. అందుకు మాధురి (Divvala Madhuri).. నేను రావాలనుకున్నాను, కాబట్టే బయటకు వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకున్నాను కాబట్టి వెళ్లాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చాలా క్లారిటీగా బదులిచ్చింది.
భయం నా బ్లడ్డులోనే లేదు
ఒకానొక దశలో శ్రీజకు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగ్గా.. భయమనేది నా బ్లడ్డులోనే లేదని మాధురి డైలాగ్ పేల్చింది. మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ శివాజీ కూడా ఆమెకు కౌంటరిచ్చాడు. మాధురి బిగ్‌బాస్ నుంచి వచ్చేముందు కూడా నాగార్జునతో నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే.. ఆ పుట్టినరోజుకల్లా రావాలనుకున్నాను, వచ్చేశాను అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడీ బజ్ ప్రోమో చూస్తుంటే మాధురి పిక్నిక్‌కు వెళ్లినట్లే కనిపిస్తోంది.

మూడు వారాలు హౌస్‌లో ఉన్న మాధురి
తనపై ఉన్న నెగెటివిటీ పోగొట్టుకోవడానికి బిగ్‌బాస్‌ను ఎంచుకుంది. అక్టోబర్ 12 వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో లేదు. రెండో వారం తననెవరూ నామినేట్ చేయలేదు. కానీ ఆ వారంలో ఆమె రీతూను బండకేసి కొడ్తా.. జుట్టుపట్టుకుని ఈడ్చి కొడ్తా.. అంటూ హద్దులు మీరి మాట్లాడింది. హౌస్‌మేట్స్ కూడా ఫేక్ బాండ్స్, ఇన్‌సెక్యూర్ అంటూ ఆమె మెడలో ఎక్కువ బోర్డులు వేశారు. దీంతో తనకు డైరెక్ట్ నామినేషన్ అనే పనిష్మెంట్ ఇచ్చింది తనూజ.
పిక్నిక్ పూర్తయింది
మాధురి కూడా ఇదే కోరుకుంది. అందుకే తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ దాన్ని తనకోసం వాడొద్దని మరీమరీ చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త/ పార్ట్‌నర్ బర్త్‌డే సమయానికి బయటకు వచ్చేసింది. ఆమె అరుపులు, కేకలు, హద్దులు మీరి మాట్లాడటం చాలామందికి చిరాకు పుట్టించింది. అదే సమయంలో ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్లు చెప్పడంతో తనపై పాజిటివిటీ కూడా వచ్చింది. మొత్తానికి మాధురి ఎలిమినేషన్‌కు పెద్దగా కారణాలంటూ ఏమీ లేదు. తనే వచ్చింది.. తనే దర్జాగా వెళ్లిపోయింది.
చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి


