మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్‌లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్‌బాస్‌ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్‌లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.
తనూజ వర్సెస్ ఇమ్మూ
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు.

ఏవైనా ఉంటే బయట చూసుకోండి
భరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్‌లో కాదు అని అరిచేసింది.
తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
ఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది.


