breaking news
Thanuja Puttaswamy
-
శ్రీజ ప్లాన్ ఇదే.. అందుకే కల్యాణ్, తనూజలపై ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది. అక్టోబర్ 27న సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బజ్తోనే మొదలైంది. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్‌బాస్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది. కల్యాణ్, తనూజ, మాధురిని టార్గెట్ చేసి హౌస్‌లోకి దిగింది.సంజనపై ప్రియ ఫైర్నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్‌లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్ను్ మోసం చేశావ్ అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావ్ అంటూ మొదట కల్యాణ్ ఆ తర్వాత పవన్‌లతో గేమ్ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్‌తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది. రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. కెప్టెన్‌ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు. దీంతో ఈ హౌస్‌లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.మాధురిని టార్గెట్ చేసిన శ్రీజబిగ్బాస్లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్‌తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్‌లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది. బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.కల్యాణ్, తనూజలపై టార్గెట్..పక్కా ప్లాన్‌తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కల్యాణ్‌ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్‌లో ఉన్న కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది. ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్‌మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది.కల్యాణ్,తనూజలను ఇరికించిన శ్రీజనువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్‌ను శ్రీజ నామినేట్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్‌తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది. ఇలా కల్యాణ్, తనూజల ఇమేజ్ను తగ్గించాలనే పక్కా ప్లాన్‌తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. -
కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం మైనస్‌గా మారనుంది.తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్‌గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్‌తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్‌ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్‌గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్‌గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్‌లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్‌కు ఇవ్వడం.. కంటెండర్‌షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని కాస్త సాఫ్ట్‌గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్‌ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
బిగ్‌బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్లో ప్రస్తుతానికి తనూజ టాప్‌లో దూసుకుపోతుంది. ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది. అయితే, తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్‌బాస్‌లో ఆమె టాప్‌లో ఉండటంతో ఈ సీరియల్‌కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతుంది.తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే, సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్‌గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. కానీ, ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా '6-5=2'లో దక్కింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ 'అందాల రాక్షసి'లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది. మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. తనూజ దెబ్బతో 27 మిలియన్లు దాటేసిందిబిగ్బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్‌తో ఉన్న ఈ పాట.. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది. బిగ్‌బాస్‌లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్‌ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది. తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది. తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్గా ఆడుతుంది. తనలో ఎమోషన్స్‌తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది. మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు. కన్నడిగ అయినా సరే.., తెలుగులోనే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్‌లో ఉంది. -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
తనూజ, ఇమ్మాన్యేయల్కు గొడవ పెట్టిన కల్యాణ్
బిగ్‌బాస్ 44వ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో కల్యాణ్ చేసిన పనికి తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య గొడవ మొదలైంది. ఇదంత మంగళవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ కానుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బెలూన్ టాస్క్‌ల పేరుతో ఇమ్ము, అయేషా చేతిలో బిగ్‌బాస్ పెట్టడం. అందులో వారిద్దరూ గెలుచుకున్న టికెట్లు తమకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. వాళ్లు వెళ్లి నామినేషన్స్ చేయవచ్చు. అయితే, ఒక టికెట్ కల్యాణ్‌కు ఇస్తాడు ఇమ్ము. అతను సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్ము ఆశ్చర్యపోతాడు. కల్యాణ్.. నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి.. ఇప్పుడు చేసిందొకటి. ఇదేంటి అంటూ గొడవకు దిగుతాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి నా వద్ద టికెట్ తీసుకున్నావ్.. ఇలా మాట తప్పుతావని అసలు ఊహించలేదంటూ మాట్లాడుతాడు. తనూజను నేను కూడా నామినేట్ చేయాలని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చి చేస్తానని చెప్పడంతో నేను నిన్ను నమ్మి నామినేషన్ టికెట్ ఇచ్చానంటూ కల్యాణ్‌పై ఫైర్ అవుతాడు.తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య చిచ్చుబిగ్బాస్ సీజన్ ప్రారంభం నుంచి ఇమ్ము, కల్యాణ్‌తో తనూజ బాగానే క్లోజ్ ఉంది. ఇప్పుడు తనను నామినేషన్ చేసేందుకు ఇలా వారిద్దరూ పోటీ పడటం తనకు నచ్చలేదు. ఇది చాలా మోసం అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యతో చెబుతుంది. ఐదు నామినేషన్స్ టికెట్లు గెలుచుకున్న ఇమ్ము ఒకటి కూడా తన వద్ద ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. అదేదో ఒక టికెట్ తనే ఉపయోగించి తనూజను నామినేషన్ చేసి ఉంటే ఇమ్ముకు పాజిటివ్ వచ్చేది. ఇలా సేఫ్‌గా కల్యాణ్‌తో ఆట నడిపించే ప్రయత్నం చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు.తనూజ, ఇమ్ము మధ్య వార్ మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తుంది. నేను ఎవరినీ కేర్ చేయనంటూ ఇమ్ముతో తనూజ అంటుంది. అంతే రేంజ్లో ఇమ్ము కూడా సమాధానం ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధ నాలో ఉందని ఇమ్ము అనడం.. ఆపై తనూజ కూడా ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడరని చెప్పడం. దానికి ఇమ్ము కూడా చిన్నపిల్లోడిలా అప్పుడు నీ కోసం ఇది చేశాను.. అది చేశాను అని చెబుతూ పాత విషయాలు తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం చాలా ఫైర్గానే ఉంది. -
నీ ఏజ్‌కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్
బిగ్‌బాస్ హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాండింగ్స్ గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ చాలా అలెర్ట్ అయిపోయారు. దీంతో 7వ వారం నామినేషన్స్‌లో బిగ్ వార్ కొనసాగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తనూజ -రమ్య మధ్య జరిగిన వార్తో పాటు రీతూ- ఆయేషాల మధ్య నడిచన మాటల ఫైర్ కూడా బాగానే పేలింది. ఎలిమినేషన్ రౌండ్లో ఇచ్చిన మాట తప్పావంటూ కల్యాణ్‌పై ఇమ్మాన్యేయల్ చేసిన కామెంట్లు ఆసక్తిగానే ఉన్నాయి. ఇలా ఈ వారం బిగ్ఫైట్తోనే మొదలైంది.రీతూ- ఆయేషాలో ఫైర్ బ్రాండ్ ఎవరుఆయేషా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షో చూసి గేమ్‌లోకి దిగింది. రీతూ, తనూజలనే టార్గెట్ పెట్టుకుని వచ్చినట్లు అర్ధం అవుతుంది. తానొక ఫైర్ బ్రాండ్ అనే రీతిలో ఆట మొదలు పెట్టింది. అయితే, ఈ వారం నామినేషన్లో రీతూ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను మెప్పించలేదు. కేవలం లవ్‌లు ఆడేందుకే హౌస్‌లోకి వచ్చావని పదేపదే రీతూను టార్గెట్ చేస్తూ ఆయేషా మాట్లాడింది. ఇదంతా బయటున్న ప్రేక్షకులకు కూడా తెలిసిందే. మళ్లీ అదే పాయింట్‌తో నామినేషన్ చేయడం ఆయేషా చేసిన రాంగ్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రీతూ పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే, రీతూ కూడా ఏంతమాత్రం తగ్గలేదు. కౌంటర్‌కు ధీటుగానే సమాధానం చెప్పకుంటూ పోయింది. రీతూ కేవలం లవ్ ట్రాక్‌తో మాత్రమే గేమ్ అడుతుందని చెప్పడవం చాలా రాంగ్.. గతంలో ఆమె చాలా బలంగా టాస్క్‌లు ఆడింది. అమ్మాయిల్లో శ్రీజ తర్వాత అంత గట్టిగా గేమ్స్ ఆడే సత్తా తనకు మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే. వీరిద్దరి మధ్య జరిగిన వార్‌లో రీతూనే ఫైర్ బ్రాండ్‌గా నిలిచిందని చెప్పవచ్చు.వయసుకు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్నామినేషన్స్ ప్రక్రియలో మొదట తనూజను టార్గెట్ చేస్తూ రమ్య హీట్ పెంచింది. తనూజ టాప్‌లో ఉందని హైపర్ ఆది కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తే కాస్త గేమ్ ట్రాక్‌లోకి వచ్చేస్తామనే ప్లాన్‌లో రమ్య ఉంది. అయితే, ఆట చూసే బరిలోకి దిగిన రమ్య పసలేని పాయింట్లతో తనూజను నామినేట్ చేసింది. తనూజ గురించి గత ఐదు వారాలుగా వస్తున్న వాటినే లేవనెత్తి మాట్లాడటం ఆపై తన గురించి బ్యాక్‌బిచ్చింగ్ చేయడం రమ్యకు నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి.నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ ఒక్క టాస్క్ కూడా ఆడలేదు.. మరోకరి సాయంతో మాత్రమే నిలబడుతున్నావ్ అంటూ తనూజ గురించి రమ్య అంటుంది. కేవలం బాండిగ్స్ కోసం మాత్రమే వచ్చావని, వాటి వల్లే ఇంట్లో ఉంటున్నావని కామెంట్స్ చేసింది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నావ్.. దాని నుంచి బయటికిరా.. ఫుల్ డ్రామా క్వీన్‌లా నటిస్తున్నావ్.. అంతా ఫేక్ అంటూ గట్టిగానే రమ్య మాట్లాడింది. తనూజ కూడా అంతే రేంజ్లో సమాధానం ఇచ్చింది.నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో.. కన్ఫెషన్ రూమ్‌లో నువ్వు ఏం అనిపించుకున్నావో అందరికీ తెలుసు. కాస్త వయసుకు తగినట్లు మాట్లాడు. ఫస్ట్ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడటం ఆపేయ్. అంటూ తనూజ ఫైర్ అయింది. అప్పుడు రమ్య కూడా.. అవును, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ మాటలు తూలింది. అలా ఇద్దరూ హౌస్‌లో హీట్ పెంచేశారు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాట్లాడిన నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ఇది బిగ్బాస్లా లేదు లవర్స్ పార్క్‌లా ఉంది అన్నావ్.. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో.. ఒకరికి మంట పెట్టాలని ఇంకొకరికి కోపం తెప్పించేలా మాట్లాడటానికే ఇక్కడికి వచ్చావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది.తనూజకు సరైన సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ చేసేందేకు రమ్య దిగింది. నువ్వు జెలస్ రాణివి.. ఫేక్ పిల్లవి.. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకర్ని వెతుక్కోనే పనిలో ఉంటావ్ .. అంటూ రమ్య వేసిన కౌంటర్‌కు తనూజ కూడా గట్టిగానే తిరిగిచ్చేసింది. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా.. ఒక్కోసారి రెండు చేతుల క్లాప్ నుంచి వచ్చే శబ్ధం కన్నా ఒక్క చేతితో వేసే విజిల్ గట్టిగా వినిపిస్తుందంటూ.. విజిల్ వేసి మరీ తనూజ బదులిచ్చింది .చెయ్ వెయ్ రా.. కల్యాణ్తనూజ- కల్యాణ్ గురించి రమ్య చేసిన బ్యాక్బిచ్చింగ్కు తనూజ ఓపెన్‌గానే సమాధానం ఇచ్చింది. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి.. వెనుకచాటు మాటలు ఎందుకంటూ రమ్యను ప్రశ్నించింది. నామినేషన్ టైమ్‌లోనే కళ్యాణ్ దగ్గరికెళ్లి.. ఒరేయ్ ఒకసారి నా భుజం మీద చెయ్ వెయ్ రా.. లాస్ట్ టైమ్ నువ్వు హ్యాండ్ వేయడానికి వస్తే ఛీ తియ్ అని అన్నాను. ఇప్పుడు వేయరా చూద్దాం. ఏమైనా జరగని అంటూ తన తల మీద చెయ్ పెట్టమని కూడా తనూజ కోరుతుంది. ఈ సీన్ బాగా వైరల్ అయింది. తనూజకు బాగా కలిసొచ్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఫైనల్‌గా ఈ వారం నామినేషన్లో తనూజ, రమ్య, కల్యాణ్, రాము, దివ్య, రాము, సంజన, శ్రీనివాస్ సాయి ఉన్నారు. -
నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం! తన కోసం తగ్గిన భరణిబిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.టాప్ 1 అని..కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ పని చేసుంటే..కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి! -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్‌బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్‌లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్‌కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్‌గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్‌గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్‌లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్‌గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు
ఇమ్యూనిటీ కోసం గేమ్స్ పెడితే ఇమ్మాన్యుయేల్ గెలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. రాము కెప్టెన్ కాబట్టి దర్జాగా ఉన్నాడు. మిగిలినవారందరికీ గేమ్స్ పెట్టకుండా ఖాళీగా వదిలేస్తే రియాలిటీ షోను కాస్త ఫ్యామిలీ సీరియల్ డ్రామాగా మార్చేలా ఉన్నారని బిగ్‌బాస్‌కు భయం పట్టుకుంది. అమ్మ, నాన్న, అన్న, కొడుకు ఇలా ఏవేవో బంధుత్వాలు కలిపేసుకుని అక్కడే ఆగిపోయారు. అందుకే వీళ్లకు కొన్ని గేమ్స్ పెట్టారు. మరి హౌస్‌లో నిన్న (అక్టోబర్ 9న) ఏం జరిగిందో చూసేద్దాం..కూతుర్ని బుజ్జగించిన నాన్నతనూజ నాన్న (భరణి)పై అలక బూనింది. దీంతో అతడు కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఈ హౌస్‌లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కాసేపు మాట్లాడాడు. ఇంతలో బిగ్‌బాస్ నాచోరే నాచోరే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో కల్యాణ్ గెలిచాడు. తర్వాతి స్థానాల్లో దివ్య, డిమాన్, సుమన్ ఉన్నారు. సంజనా టీమ్‌కు ఒక్క పాయింట్ కూడా రాలేదు. లీడర్ బోర్డ్‌లో మొదటి స్థానంలో ఉన్న దివ్య- భరణికి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నావల్ల కాదు: సంజనాపట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఫ్లోరా- సంజనా, శ్రీజ- సుమన్‌లలో నుంచి ఒక జట్టును రేసు నుంచి తొలగించవచ్చన్నాడు. దీంతో వాళ్లు ఫ్లోరా- సంజనాను తీసేశారు. తన కష్టమంతా వృథా కావడంతో సంజనా తట్టుకోలేకపోయింది. ఒంటరి కూర్చుని ఏడ్చేసింది. ఫిజికల్ టాస్కులు ఉంటాయని నాకు తెలీదు. అబ్బాయిల శరీరంపై నుంచి ఎలా దూకాలి బిగ్‌బాస్? నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగైతే నేనుండలేను, ఇంటికెళ్లిపోతాను. తనూజ గెలుపు.. ఏడ్చేసిన రీతూసుమన్ శెట్టిపై నేనెలా దూకాలి? అమ్మాయిలతో అయితే పర్లేదు కానీ, అబ్బాయిలతో ఎలా? ఇలాగైతే నన్ను ఇంటికి పంపించండి అని ఏడ్చింది. తర్వాత పిరమిడ్ కట్టు-పాయింట్స్ పట్టు గేమ్‌లో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఈ గేమ్‌లో డిమాన్- రీతూ నాలుగో స్థానంలో నిలబడ్డారు. గేమ్ నీ వల్లే పోయిందన్నట్లుగా డిమాన్ చిరాకుపడటంతో రీతూ ఏడ్చింది. ఇక ఇంతటితో గేమ్స్ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డ్‌లో దివ్య- భరణి ఫస్ట్ ప్లేస్‌లో , తనూజ- పవన్ కల్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.తనూజ త్యాగంమొదటి స్థానంలో ఉన్నవారు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్‌కి వెళ్లొచ్చన్నారు. రెండో ప్లేస్‌లో ఉన్న జట్టులో ఒక్కరికే సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. సేఫ్ జోన్లో ఉంటానని కల్యాణ్ అనగానే తనూజ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఇక్కడ శ్రీజ ప్లాన్ వర్కవుట్ అయింది. శ్రీజ- కల్యాణ్ ఒక టీమ్‌గా జత కడితే ఎవరో ఒకరు నష్టపోయే ఛాన్స్ ఉంటుందని ముందే ఆలోచించింది. అందుకనే ఇద్దరూ వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు కల్యాణ్ సేఫ్ జోన్లో ఎంటరయ్యాడు. ఇక కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, కల్యాణ్ మాత్రమే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలినవారంతా డేంజర్ జోన్లో ఉన్నారు.చదవండి: అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. ఒకరోజు గ్యాప్‌తో మళ్లీ షురూ -
ప్రపోజ్ చేసిన కల్యాణ్.. కానీ చివరకు వరస్ట్ ఆటగాడిగా
బిగ్‌బాస్ షో ప్రేమ, రిలేషన్ లాంటి వాటికి పెట్టింది పేరు. ప్రతి సీజన్లోనూ ఏదో ఓ జంట తెగ కెమిస్ట్రీ పండించేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి జంటలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిరోజుల ముందు వరకు ట్రయాంగిల్ ప్రేమకథ కనిపించింది. కానీ ఇప్పుడు రెండు జంటల మధ్య సరదా ముచ్చట్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఎపిసోడ్లో జంటల్లో ఒకటైన తనూజ-కల్యాణ్ 'ప్రపోజల్' కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి ఈ విషయంపై దృష్టి పెట్టడం వల్లో ఏమో గానీ చివరకొచ్చేసరికి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్‌గా మిగిలాడు. ఇంతకీ 31వ రోజు ఏమేం జరిగింది?హౌస్మేట్స్ ఇమ్యూనిటీ సాధించేందుకు బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్లో పట్టు వదలకు, బెలూన్ టాస్క్ పోటీలు పెట్టారు. బుధవారం నేరుగా గేమ్స్ కాకుండా కాసింత డ్రామా నడిచింది. ఉదయం లేచిన తర్వాత బయట అలా తిరుగుతూ ఇమ్మూ, తనుజ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. నేను నీ బ్రదర్‌గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ అంటూ తనూజతో ఇమ్మూ... సినిమా డైలాగ్స్ కొట్టాడు. దీంతో నీ వయసెంత అని తనూజ అడిగింది. నీ కన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని ఇమ్మూ చెప్పాడు. ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తానని తనూజ పంచ్ వేసింది. చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని, నాకెందుకు అని ఇమ్మూ.. కల్యాణ్ వైపు చూసి ఫన్ చేసేశాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు)కాసేపటి తర్వాత తనూజతో డిస్కషన్ పెట్టిన కల్యాణ్.. ఏదైనా ఛాన్స్ ఉంది, నాలాంటోడు అయితే నీకు ఓకేనా? అని నేరుగా ప్రపోజల్ పెట్టేశాడు. దీంతో తనూజ.. అందుకే నిన్ను పిల్లాడు అనేది అని నవ్వుకుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూల్, కామ్‌గా డీల్ చేసే పర్సన్.. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి, ఆ టాపిక్‌ని తెగ్గొట్టే సత్తా, అన్నింటినీ మించి నా మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అంటే నాకు ఇష్టం అని తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో తనూజ చెప్పింది. దీంతో కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమ్మూ-రీతూ చౌదరి కౌంటర్స్ వేసి నవ్వుకున్నారు.మళ్లీ గేమ్స్ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. 'మ్యాచ్ ఇట్ విన్ ఇట్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా జట్టు సభ్యుల్లోని ఒకరు.. యాక్టివిటీ ఏరియాలోని మ్యూజియంకు వెళ్లి అక్కడున్న వస్తువుల్ని గమనించి.. మళ్లీ లివింగ్ ఏరియాకు వచ్చి బోర్డుపై దాని బొమ్మ గీస్తారు. జట్టులోని మరో సభ్యుడు.. ఆ వస్తువు లేదా బొమ్మ ఏంటని సరిగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ పోటీలోని తొలి రౌండ్లో దివ్య-భరణి గెలిచారు. తర్వాత వరస రౌండ్లలో ఫ్లోరా-సంజన, శ్రీజ-సుమన్, రీతూ-పవన్ గెలిచారు. తనూజ-కల్యాణ్ జోడీ మాత్రం ఓడిపోయారు. తనూజ బొమ్మలు బాగానే వేసినప్పటికీ కల్యాణ్ వాటిని గుర్తుపట్టలేకపోయాడు.దీని తర్వాత 'హోల్డ్ ఇట్ లాంగ్' అనే మరో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా కేటాయించిన ఫ్లాట్‌ఫామ్ రెండు వైపుల నిలబడి, తాళ్లతో ఉన్న హ్యాండిల్స్‌తో ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచి పట్టుకోవాలి. టాస్క్ ముగిసేవరకు ఏ జట్టు.. ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు గెలిచినట్లు. అయితే ఈ గేమ్‌లోనూ కల్యాణ్-తనూజ ఓడిపోయారు. లెక్క ప్రకారం పవన్-రీతూతో పాటు వీళ్లు చాలాసేపు ఉన్నారు. కానీ కల్యాణ్.. మాట్లాడి తనూజని డిస్టర్బ్ చేశాడు. దీంతో ఓడిపోయారు. తర్వాత తనూజ.. కల్యాణ్‌పై గట్టిగా అరిచేసింది. కళ్యాణ్ ఫోకస్ ఉండాల్సింది దానిపైన కద కళ్యాణ్.. నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది అని గట్టిగానే ఇచ్చేసింది. లీడర్ బోర్డ్‌లో పవన్-రీతూ (190 పాయింట్స్), సంజన-ఫ్లోరా (180), దివ్య-భరణి (180), తనూజ-కల్యాణ్ (110), శ్రీజ-సుమన్ శెట్టి(90) వరస స్థానాల్లో నిలిచారు. ఇక డేంజర్ జోన్లో కల్యాణ్, శ్రీజ, సుమన్ నిలిచారు. అందరూ కలిసి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్ అని డిసైడ్ చేశారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్‌తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్‌లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్‌తో ఇద్దరు షాక్‌లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్‌లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్‌గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్‌లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్‌లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్‌పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?


