breaking news
Emmanuel
-
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్‌బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్‌లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్‌కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్‌గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్‌గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్‌లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్‌గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్‌బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్‌బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
లత్కోర్ హరీశ్.. దారుణంగా అవమానించిన నాగ్! జుట్టు కత్తిరించుకున్న రీతూ
నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్ఫైర్తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్ ఆడాడని రాముపై మండిపడింది. త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు. జుట్టు కత్తిరించుకున్న రీతూతనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్ హెయిర్‌కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్. ఒప్పుకోని సుమన్, శ్రీజఅందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూమ్లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.లత్కోర్ పంచాయితీఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ద ట్రయల్ 2 సిరీస్ రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే! -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు!
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
సంజనా ఎలిమినేట్! వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఈవారం మొదట్లో హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్.గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్హౌస్లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్. భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్‌బాస్. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.నామినేషన్స్‌లోనే లేదుఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్‌లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. చదవండి: 8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్! -
వాళ్లను టాప్ 5లో పెట్టిన వైల్డ్‌కార్డ్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్‌మేట్స్‌కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.ర్యాంకింగ్..భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్‌ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్‌ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్‌బాస్.కెప్టెన్సీ టాస్క్వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించేశారా? లేదంటే బిగ్‌బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
‘భూతం ప్రేతం’ పెద్ద హిట్ కావాలి: అనిల్ రావిపూడి
‘జబర్దస్త్’ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి. వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూ΄÷ందిన చిత్రం ‘భూతం ప్రేతం’. ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా భూతానికి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ భూతం నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది కథ. మా చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది... భయపెడుతుంది. ఈ ఏడాదిలోనే మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్, కెమెరా: యోగేష్ గౌడ.


