'బిగ్‌బాస్ 7'లో టాస్క్ అని రచ్చ.. చివరకొచ్చేసరికి!? | Bigg Boss 7 Telugu Day 5 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 5 Highlights: షకీలాకు పానిక్ ఎటాక్.. గజగజా వణికిపోయారు!

Published Fri, Sep 8 2023 10:53 PM | Last Updated on Sat, Sep 9 2023 9:35 AM

Bigg Boss 7 Telugu Day 5 Episode Highlights - Sakshi

'బిగ్‌బాస్ 7' తెలుగు షో మెల్లమెల్లగా పికప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. తొలుత ఒకటి రెండు రోజులు సరదాగా కనిపించిన హౌస్ కాస్త.. ఇప్పుడు గొడవలతో హీటెక్కిపోతోంది. తాజాగా ఓ టాస్క్‌లో భాగంగా మరీ అంత కాకపోయినా బాగానే అందరూ గొడవలు పడ్డారు. కానీ చివరకు వచ్చేసరికి బిగ్‌బాస్ ఉసూరుమనిపించారు. ఇది విచిత్రంగా అనిపించింది. ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో ఐదు రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం.

(ఇదీ చదవండి: ఈమెని గుర్తుపట్టారా? హీరోయిన్‌గా తెలుగులో ఒకే సినిమా!)

టాస్క్‌లో దామిని ఫెయిల్
ఎపిసోడ్ ఓపెన్ చేస్తే.. దామిని, కిరణ్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్‌బాస్ వాళ్లకి ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ల తలపై గుడ్లు పగలగొట్టి దానితో ఆమ్లెట్ వేసి, తనకు ఇవ్వాలని అన్నారు. ఇందులో భాగంగా కిరణ్ రాథోడ్ సక్సెస్ కాగా, దామిని మాత్రం బిగ్‌బాస్‌ని మెప్పించలేకపోయింది. ఈ టాస్క్ నుంచి తప్పించుకునేందుకు రతిక, శివాజీ చాలా బాత్రూంలో దాక్కుని ఉండిపోయారు. అంతా అయిపోయిన తర్వాత బిగ్‌బాస్‌ పిలిస్తే తప్ప వాళ్లు బయటకు రాలేదు. 

రతిక-శివాజీ విన్నర్స్
మరోవైపు 'ఇంప్రెస్ ద బిగ్‌బాస్' టాస్కులో రతిక, శివాజీ విజేతలుగా నిలిచారని స్వయంగా బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే రతిక.. ఏం పనిచేయకపోయినా తనని బిగ్‌బాస్ ఎందుకు పొగుడుతున్నాడోనని షకీలా.. తోటి కంటెస్టెంట్స్‌కి చెప్పింది. మరోవైపు పల్లవి ప్రశాంత్.. తనకు అన్నలా(బ్రదర్) అనిపిస్తున్నాడని అతడితోనే చెప్పింది. 

(ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో)

షకీలాకు ఎటాక్
తేజని భయపెట్టాలని ఫిక్స్ అయిన షకీలా.. తనకు పానిక్ ఎటాక్ వచ్చినట్లు నటించింది. దీంతో అందరూ ఆమెకు ఏమైంది ఏమైందని కంగారుపడ్డారు. ఆమె నిద్రపోతున్న సమయంలో పక్కనే ఉన్న తేజ.. ఒక్కసారిగా షకీలా ఉలిక్కిపడి లేచేసరికి గజగజా వణికిపోయాడు. తర్వాత తీరిగ్గా ఊరికనే.. తేజని భయపెట్టడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వ్యక్తిగా తనకి నచ్చుతాడు తప్ప ఫీలింగ్స్ ఏం లేవని రతిక క్లారిటీ ఇచ్చేసింది. శుభశ్రీతో మాట్లాడుతూ ఇవన్నీ బయటపెట్టింది.

గెలిచినట్లే గెలిచి
ఇకపోతే 'ఫేస్ ద బీస్ట్' టాస్కులో గెలిచిన ప్రియాంక, సందీప్‌తోపాటు 'ఇంప్రెస్ట్ ద బిగ్‌బాస్' టాస్కులో గెలిచిన రతిక, శివాజీ.. పవర్ అస్త్ర కోసం పోటీపడ్డారు. అయితే ఈ నలుగురిలో ఎవరికీ అర్హత లేదో చెప్పమని.. మిగతా 10 మంది కంటెస్టెంట్స్ కి ఆర్డర్ వేశాడు. దీంతో రతికని.. శుభశ్రీ, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, శోభాశెట్టి, తేజ నామినేట్ చేశారు. శివాజీని అమర్‌దీప్, గౌతమ్ నామినేట్ చేశారు. ప్రియాంకని ప్రశాంత్, సందీప్‌ని ప్రిన్స్ నామినేట్ చేశారు. 

టార్గెట్ రతిక
దీంతో ఎలా అయితే 'పవర్ అస్త‍్ర' పోటీలోకి రతిక, శివాజీ వచ్చారో.. అలానే కంటెస్టెంట్స్ నామినేట్ చేయడంతో సైడ్ అయిపోయారు. అంతా చూస్తుంటే.. రతికని హౌసులో అందరూ టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా ఈమెకి ఇది ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది కూడా. అలా ఐదో రోజు ఎపిసోడ్ ముగిసింది. 

(ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement