బిగ్‌బాస్‌ హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌! | Bigg Boss 7 Telugu: All Contestants Are Expressing Dissatisfaction With Shivaji behavior | Sakshi
Sakshi News home page

Bigg Boss 7: హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌!

Published Tue, Sep 12 2023 3:21 PM | Last Updated on Thu, Sep 14 2023 2:03 PM

Bigg Boss 7 Telugu: All Contestants Are Expressing Dissatisfaction With Shivaji behavior - Sakshi

కోడలుకు బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకిందట.. అలా ఉంది శివాజీ పరిస్థితి. బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరికి ఇలా ఉండాలి.. అలా ఆడాలి అని చెబుతూ ఆయన ఆట ఆడడం ఆపేశాడు. అంతేకాదు అతి చేష్టలు.. చిల్లర మాటలతో తోటి కంటెస్టెంట్స్‌ ముందే కాదు.. షో చూస్తున్న లక్షలాది తెలుగు ప్రజల వద్ద కూడా అబాసుపాలు అవుతున్నాడు. నేను తోపు..తురుమ్‌ ఖాన్‌ అన్నట్లుగా ప్రవర్తిస్తూ అందరి కంటే దరిత్రంగా గేమ్‌ ఆడుతున్నాడు. 

ఏ ఒక్కరూ ఇష్టపడని వైనం
సోమవారం జరిగిన నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో శివాజీని అత్యధికంగా ఐదుగురురు నామినేట్‌ చేశారు. ముందుగా అమర్‌ దీప్‌..శివాజీని నామినేట్‌ చేస్తూ ఇచ్చి పడేశాడు.  ‘ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు.. వాడికి ఫోకస్ ఉంది.. వాడు మగాడంటే.. మరి నేను ఆటాడటానికి కాకుండా పేకడటానికి వచ్చానా అన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్‌ కూడా శివాజీని నామినేట్‌ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు’ అని చెప్పింది. దీంతో దీంతో శివాజీ.. ‘నేను ఇక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను’అంటూ వేలు చూపిస్తూ..వెళ్లు వెళ్లు అన్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ప్రియాంక.. ‘సార్ ఈ ప్రవర్తన సరికాదు.. వేలు చూపించొద్దు’ అని  సీరియస్‌ అయింది. అయినప్పటికీ శివాజీ వేలు దించకుండా.. ‘నీకంత లేదమ్మా’ అని అన్నాడు. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా మనోడికి తెలియదు కానీ.. జనానికి మాత్రం నీతులు చెబుతాడు. 

బయటపడ్డ శివాజీ  అసలు క్యారెక్టర్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదు.. అప్పుడు శివాజీ అసలు క్యారెక్టర్‌ బయటపడింది. ఇతరులకు నీతులు చెబుతాడు కానీ మనోడు పాటించడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పైగా సింపథీ కోసం అన్నట్లుగా పల్లవి ప్రశాంత్‌తో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రైతుబిడ్డని పొగిడితే తనకు కూడా ఓట్లు పడతాయని భ్రమ పడుతున్నాడు. కానీ ఎన్నాళ్లని ముసుగు వేసుకొని ఉండగలడు? ఎంత నటించాలని ప్రయత్నించిన..అక్కడక్కడ ఒరిజినాలిటీ బయటపడుతూనే ఉంటుంది కదా?. అది ప్రేక్షకులకు ఎప్పుడో తెలిసిపోయింది. హౌస్‌మేట్స్‌ కూడా ఇది పసిగట్టి.. నిన్నటి నామినేషన్స్‌లో గట్టిగానే ఇచ్చి పడేశారు. 

గలీజ్‌ పురాణం.. 
ఒక వ్యక్తి ఏదైన అంశం గురించి మాట్లాడాలంటే ఓ అర్హత ఉండాలి. ఉదాహారణకు రాజకీయాలను గురించి మాట్లాడాలంటే.. దానిపై ఎంతో కొంత అవగాహన ఉండాలి. ‍కానీ రాజకీయాల గురించి  ఇంగిత జ్ఞానం కూడా లేని శివాజీ.. 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథను అల్లి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశాడు. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలికి నవ్వుల పాలైంది. శివాజీ గరుడ పురాణంలో చెప్పి ఏ ఒక్క విషయం కూడా వాస్తవంగా జరుగలేదు. అంతేకాదు తాను మద్దతుగా నిలిచిన టీడీపీ మట్టికొట్టుకపోయింది. అనంతరం బీజేపీలో చేరాడు. ఆ విషయం పార్టీతో పాటు జనాలు కూడా మర్చిపోయారు. 

14 మందితో ఇముడలేనివాడు సమాజం గురించి..
బిగ్‌బాస్‌ హౌస్‌లో 14 మంది ఉన్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి కూడా పూర్తిగా నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివాజీయే. తన మాయమాటలు.. సూక్తులతో హౌస్‌మేట్స్‌ అందరిని తన చేతిల్లో ఉంచుకున్నానని శివాజీ భ్రమ పడ్డాడు. కానీ నిన్నటి నామినేషన్స్‌ ఆ భ్రమ తొలిగిపోయింది. ఒక్కక్కరు అతని గురించి చెబుతుంటే.. ఇది కదా శివాజీ అసలు రూపం అని అందరికి అనిపించింది. కేవలం 14 మందితో కూడా ఇముడలేని వ్యక్తి.. సమాజం గురించి, వ్యవస్థల గురించి మాట్లాడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంటుంది. 

అక్కడ చంద్రబాబు.. ఇక్కడ శివాజీ
మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు చేయడంలో చంద్రబాబు, శివాజీ ఇద్దరు ఇద్దరే. కెమెరాల ముందు వారి నటన కమల్‌ హాసన్‌ని మించి పోతుంది. కానీ ఇప్పుడిప్పుడే జనాలకు అసలు విషయం తెలిసిపోతుంది.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కావడంతో.. బాబుగారి బాగోతాలు ఇన్ని ఉన్నాయా? అని జనాలు చర్చించుకుంటున్నారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో శివాజీ ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. గరుడపురాణం అంటూ సోది చెబితే.. మనమంతా టైం వేస్ట్‌ చేసుకోని చూశాం కదా, ఇతని అసలు క్యారెక్టర్‌ ఇదా? అని నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement