రీ-రిలిజ్‌కు రజనీకాంత్ ఐకానిక్ సినిమా | Rajinikanth Sivaji Movie Re-Release Date Locked | Sakshi
Sakshi News home page

రీ-రిలిజ్‌కు రజనీకాంత్ ఐకానిక్ సినిమా

Published Thu, Sep 12 2024 1:36 PM | Last Updated on Thu, Sep 12 2024 1:49 PM

Rajinikanth Sivaji Movie Re-Release Date Locked

'శివాజీ: ది బాస్' రీరిలీజ్‌ కానుంది. శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది.  ఈ చిత్రంలో రజనీకాంత్‌, శ్రియ శరన్‌,సుమన్‌ ప్రధాన పాత్రలలో నటించారు.  కోలీవుడ్ చరిత్రలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తమిళ చిత్రంగా శివాజీ నిలిచింది . AR రెహమాన్‌కు 'శివాజీ' 100వ సినిమా కావడం విశేషం. అయితే, అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సుమారు 17 ఏళ్ల తర్వాత మరోసారి రీరిలీజ్‌ కానుంది.

సెప్టెంబర్ 20న 4K వర్షన్‌లో శివాజీ విడుదల కానుంది. అయితే, ఎంపిక చేసిన  స్క్రీన్‌లలో, టిక్కెట్ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది. 2012లో రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా శివాజీ చిత్రాన్ని 3D వర్షన్‌లో విడుదల చేశారు. ఆ సమయంలో సినిమా నిడివి 30 నిమిషాలు తగ్గించారు. 3D కొత్త డాల్బీ అట్మాస్ ప్లాట్‌ఫారమ్‌తో ప్రారంభించబడిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇంతకాలానికి మళ్లీ 3D వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 20న రీరిలీజ్‌ కానున్న శివాజీ సినిమా కోసం రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement